Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ది హత్యే!
ABN , First Publish Date - 2022-12-26T18:54:19+05:30 IST
సుశాంత్ సింగ్ రాజ్ఫుత్కు కూపర్ హాస్పిటల్లో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన సిబ్బందిలో ఒకరైన రూప్‌కుమార్ షా (Rupkumar Shah) తాజాగా మీడియాతో మాట్లాడారు. సుశాంత్‌ది హత్యేనని ఆరోపించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ (Sushant Singh Rajput) 2020, జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీ టౌన్ మాఫియా వల్లే హీరో మరణించాడని అనేక మంది ఆరోపించారు. అతడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని సుశాంత్ సోదరి కూడా పలు మార్లు చెప్పింది. హీరోయిన్ రియా చక్రవర్తితో సహా అనేక మందిపై ఆమె ఆరోపణలు గుప్పించింది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని హత్యేనని పలువురు సెలబ్రిటీలు కూడా వాదించారు. సుశాంత్‌కు పోస్ట్ మార్టమ్ నిర్వహించిన వ్యక్తి ఒకరు అతడిది హత్యేనని తాజాగా చెప్పడం సంచలనంగా మారింది.
సుశాంత్ సింగ్ రాజ్ఫుత్కు కూపర్ హాస్పిటల్లో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన సిబ్బందిలో ఒకరైన రూప్‌కుమార్ షా (Rupkumar Shah) తాజాగా మీడియాతో మాట్లాడారు. సుశాంత్‌ది హత్యేనని ఆరోపించారు. ‘‘ఆత్మ హత్యకు, హత్యకు చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి మృతదేహాన్ని చూడగానే అది ఆత్మహత్యనా, హత్యనా అనేది సులభంగా అర్థమవుతుంది. సుశాంత్‌ను ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పుడు అతడి మెడ మీద గాయాలు ఉన్నాయి. శరీరం మీద పిడిగుద్దులు కురిపిస్తే ఎటువంటి గాయాలు అవుతాయో అటువంటివి సుశాంత్ మృతదేహాం మీద కనిపించాయి. హత్యకు పాల్పడితేనే ఇటువంటి గాయాలు అవుతాయి. ఆత్మహత్య చేసుకుంటే అటువంటివి కనిపించవు. సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ అద్భుతమైన నటుడు. అనేక సినిమాలు చేశాడు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? చేతులు, కాళ్లపై గాయాలు ఉన్న వ్యక్తి ఎలా ఉరి వేసుకుంటాడు?’’ అని రూప్ కుమార్ షా తెలిపాడు. సుశాంత్‌ది హత్యేనని రూప్ తెలపడంతో ట్విటర్లో సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.