18 Pages: ఎక్కడ నా చేతినుంచి జారిపోతవో అని.. గుబులైతాందే!
ABN , First Publish Date - 2022-12-16T22:27:18+05:30 IST
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ‘కార్తికేయ 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘18 పేజెస్’ (18 Pages). ‘కుమారి 21 ఎఫ్’ (Kumar 21 F) చిత్రంతో..
యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘18 పేజెస్’ (18 Pages). ‘కుమారి 21 ఎఫ్’ (Kumar 21 F) చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్యప్రతాప్ (Palnati Surya Pratap) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు (Bunny Vas) నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి కథను అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని మరో సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘నీ వల్ల ఓ పిల్ల’ (Nee Valla O Pilla Lyrical) అనే ఈ పాటతో తిరుపతి మట్ల (Thirupathi Matla) అనే కొత్త పాటల రచయితను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ‘18 పేజెస్’ మూవీ మేకర్స్. ఇక పాట విషయానికి వస్తే..
‘‘నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిలా నా గుండెల్లా..
నీ పేరేందో దెలువది.. నీ ఊరేందో దెలువది
నువ్ ఏడుంటవో దెలువది.. ఎట్లుంటవో దెలువది
అయినా నా యద చాటు నీ బొమ్మే గీసుకున్న.. నీ పేరే రాసుకున్న
నువ్ చదివిన నుంచి
నన్ను నేను మరిచినా
అన్ని ఇడిచి పెట్టినా
నిన్నే ఒడిసిపట్టినా..
ఎక్కడ నా చేతినుంచి జారిపోతవో అని.. గుబులైతాందే..’’ అంటూ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా సాగిన ఈ పాటను తిరుపతి మట్ల రాయడమే కాకుండా.. ఆయనే స్వయంగా ఆలపించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న క్రిస్మస్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.