Matti Kusthi: ఓటీటీలోని రానున్న మట్టీ కుస్తీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-12-28T10:48:34+05:30 IST

టాలీవుడ్ నటుడు రవితేజ (Raviteja) మొదటిసారి నిర్మించిన చిత్రం ‘మట్టీ కుస్తీ’ (Matti Kusthi). తమిళంలో ‘గట్టా కుస్తీ’..

Matti Kusthi: ఓటీటీలోని రానున్న మట్టీ కుస్తీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Matti Kusthi

టాలీవుడ్ నటుడు రవితేజ (Raviteja) మొదటిసారి నిర్మించిన చిత్రం ‘మట్టీ కుస్తీ’ (Matti Kusthi). తమిళంలో ‘గట్టా కుస్తీ’ (Gatta Kusthi). తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal), ఐశ్వర్యా లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా నటించిన ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ సంబంధించిన ఓటీటీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ టీం ప్రకటించింది.

matti-kusthi-1.jpg

కేరళకి చెందిన కీర్తీ (ఐశ్వర్యా లక్ష్మి) రెజ్లింగ్ ఛాంపియన్. అయితే ఆమె రెజ్లింగ్‌లో పాల్గొనడం కుటుంబ సభ్యులకి ఇష్టముండదు. అందుకే బాబాయ్ సపోర్ట్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుస్తుంది. ఈ విషయాన్ని దాచి తెలుగబ్బాయి అయినా వీర (విష్ణు విశాల్) అనే ఆసామీకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే పెళ్లికి ముందు తనకి భార్య ఎక్కువగా చదువుకోకూడదని, తను చెప్పిన మాట వినాలని అనుకుంటాడు. అసలు నిజం తెలుసుకున్న తర్వాత అతనికి పరిస్థితి ఏంటనేది ఈ చిత్ర కథ. కరుణాస్, మునిష్కాంత్, కాళీ వెంకట్, హరీష్ పేరడి, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు.

Updated Date - 2022-12-28T10:48:35+05:30 IST