Singer Chitra: నేను ఆయనకు వీరాభిమానిని
ABN , First Publish Date - 2022-12-18T10:48:03+05:30 IST
జానపద కళాకారుడు ఆంథోనీ దాసన్ (Anthony Daasan)కు వున్న లక్షలాది మంది వీరాభిమానుల్లో తాను కూడా ఒకరినని ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్ర అన్నారు. ఆయన సొంతంగా నెలకొల్పిన ఫోక్ మార్లీ రికార్డ్స్..
జానపద కళాకారుడు ఆంథోనీ దాసన్ (Anthony Daasan)కు వున్న లక్షలాది మంది వీరాభిమానుల్లో తాను కూడా ఒకరినని ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్ర అన్నారు. ఆయన సొంతంగా నెలకొల్పిన ఫోక్ మార్లీ రికార్డ్స్ (Folk Marley Records) మ్యూజిక్ కంపెనీని పలువురు సినీ ప్రముఖులు, గ్రామీణ జానపద కళాకారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాయని చిత్ర (Singer Chitra) మాట్లాడుతూ.. గ్రామీణ జానపద గేయాలు, కళలను పరిరక్షించే బృహత్తర బాధ్యతను ఆంథోనీ దాస్ భుజానికెత్తుకున్నారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్నారు. వారికి ఒక మార్గం చూపించేందుకు, ప్రోత్సహించేందుకే ఈ మ్యూజిక్ కంపెనీని ఆరంభించారు. ఇది వర్థమాన జానపద కళాకారులకు అండగా ఉంటుందని అన్నారు.
నటుడు ఆంథోనీ దాసన్ మాట్లాడుతూ.. ‘‘ఎంతో టాలెంట్ ఉన్న జానపద కళాకారులు కోకొల్లలుగా ఉన్నారు. వారిని సరైన మార్గనిర్దేశం చేసేందుకు ఈ మ్యూజిక్ కంపెనీని ప్రారంభించారు. గాయని చిత్రమ్మ మాకు ఎంతో అండగా ఉన్నారు. 17 యేళ్ళ ప్రాయం నుంచే ఫోక్ సాంగ్స్, నాట్టుపురప్పాట్టు పాటలు పాడటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డాను. చెన్నై సంగమమం ద్వారా సినీ నటుడు కరుణాస్ పరిచయం కావడం, ఆయన ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభకలిగిన జానపద కళాకారులను ప్రోత్సహించేందుకే ఈ మ్యూజిక్ కంపెనీని ప్రారంభించడం జరిగింది. చిన్న కళాకారుడిని.. పెద్ద మీడియా అండగా ఉండి పోత్సహించాలి’’ అని ఆయన ప్రాధేయపడ్డారు.