Indian 2: కమల్ హాసన్ మేకప్‌కే 5 గంటలు
ABN , First Publish Date - 2022-12-20T22:30:20+05:30 IST
విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal Haasan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ (Indian 2) సినిమా షూటింగ్
విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal Haasan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ (Indian 2) సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్. తాజాగా రకుల్ ఈ చిత్ర విశేషాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..
‘‘ఇందులో కమల్ హాసన్ వృద్ధుడి పాత్రలో నటిస్తున్నారు. వృద్ధుడి గెటప్ కోసం మేకప్ వేసేందుకు ఏకంగా 5 గంటల సమయం పడుతుంది. ఇందుకోసం ఆయన తెల్లవారుజామున 5 గంటలకే షూటింగ్ స్పాట్‌కు వస్తున్నారు. అప్పటి నుంచి మేకప్ ప్రారంభిస్తే, పూర్తయ్యేందుకు ఉదయం 10 గంటలవుతుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ మేకప్ తొలగించేందుకే రెండు గంటల సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఆయన ఎంతో ఓపిగ్గా, ప్రశాంతంగా కూర్చొనివుంటారు. గత ఆరు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న కమల్.. ఎన్నో సిల్వర్ జూబ్లీ హిట్స్ చూశారు. ఇండస్ట్రీ, ప్రేక్షకుల పల్స్, ఇతర సినిమా విషయాల గురించి ఆయనకు తెలిసినంతగా మరొకరకి తెలియదని నేను నమ్ముతున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఈమె ‘ఇండియన్-2’తో పాటు ఆర్.రవికుమార్ (R Ravikumar) దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తోంది.