Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:49 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి వేడుకకు అంతా సిద్ధమవుతోంది. తన ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరేని ఐరా ఖాన్ ప్రేమించి పెళ్లాడబోతోంది. ఐరా, నుపుర్‌ల నిశ్చితార్థం 2022 నవంబర్ 18న జరగగా.. పెళ్లి 2024 జనవరి 3వ తేదీన ముంబైలోని ‘తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్’లో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా తెలుస్తోంది.

Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?
Ira Khan and Nupur Shikhare

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan) పెళ్లి వేడుకకు అంతా సిద్ధమవుతోంది. తన ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరే (Nupur Shikhare)ని ఐరా ఖాన్ ప్రేమించి పెళ్లాడబోతోంది. కుమార్తె ప్రేమను ఆమిర్ ఖాన్ అంగీకరించడమే కాకుండా.. వారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐరా, నుపుర్‌ల నిశ్చితార్థం (Ira and Nupur Engagement) 2022 నవంబర్ 18న జరగగా.. పెళ్లి 2024 జనవరి 3వ తేదీన ముంబైలోని ‘తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్’లో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా తెలుస్తోంది.

Ira-Khan-2.jpg

ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం.. ప్రీ వెడ్డింగ్ పనులను జరుపుకుంటూ వస్తున్నారు. రీసెంట్‌గా ముంబైలో ఓ గ్రాండ్ పార్టీని జరిపినట్లుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో ఐరా, నుపుర్ ఒకరినొకరు చూసుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఇక వీరి మ్యారేజ్ రిసెప్షన్‌కు సంబంధించి బాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. (Ira and Nupur Marriage)


Ira-Khan-1.jpg

న్యూ ఇయర్ కావడంతో.. ఆ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉన్న సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కావడం కష్టం అని భావించిన ఆమిర్ అండ్ ఫ్యామిలీ.. రిసెప్షన్‌ను మాత్రం భారీ స్థాయిలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జైపూర్‌లో లావిస్ రిసెప్షన్‌ను (Ira and Nupur Reception in Jaipur) ప్లాన్ చేశారని, ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరుకానున్నారనేలా టాక్ వినిపిస్తోంది. ఐరా, నుపుర్‌ల విషయానికి వస్తే.. ఆమిర్ ఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్ వద్ద.. ఐరా కూడా ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకునేది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వారి ప్రేమను పెద్దవాళ్లకి తెలియజేయడం.. ఇరు ఫ్యామిలీ మెంబర్స్ వారి పెళ్లికి అంగీకరించడం వంటివి చకచకా జరిగిపోయాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Kalyan Ram: రెండేళ్ల కష్టమిది.. అందరికీ థ్యాంక్స్

**************************

*Sai Pallavi: సాయిపల్లవి ఎంటరైంది..

****************************

*Right: ఇయర్ ఎండింగ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ సందడి.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే!

****************************

*Vijayakanth: రియల్ హీరో విజయకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా? కెప్టెన్‌ స్మృతిలో రాష్ట్రం

***************************

Updated Date - Dec 30 , 2023 | 11:50 AM