Adah Sharma: చూసి మాట్లాడుంటే బావుండేది!
ABN , First Publish Date - 2023-07-14T16:30:41+05:30 IST
విమర్శలు, వివాదాల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ఎంతగా విజయవంతమైందో తెలిసిందే! చిన్న సినిమాగా విడుదలై కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం గురించి కమల్‌హాసన్, నసీరుద్దిన్ షా లాంటి దిగ్గజ నటులు పలు వేదికలపై విమర్శలు చేశారు. తనకు ప్రచార చిత్రాలంటే నచ్చవని, అలాంటి వాటికి తాను పూర్తిగా వ్యతిరేకినని కమల్‌హాసన్ చెప్పారు.
విమర్శలు, వివాదాల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) చిత్రం ఎంతగా విజయవంతమైందో తెలిసిందే! చిన్న సినిమాగా విడుదలై కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం గురించి కమల్‌హాసన్(kamal Haasan), నసీరుద్దిన్ షా లాంటి దిగ్గజ నటులు పలు వేదికలపై విమర్శలు చేశారు. తనకు ప్రచార చిత్రాలంటే నచ్చవని, అలాంటి వాటికి తాను పూర్తిగా వ్యతిరేకినని కమల్‌హాసన్ చెప్పారు. సినిమా టైటిల్ కింద ‘నిజమైన కథ’ అని రాయగానే సరిపోదని.. అలా రాసినంత మాత్రాన అది నిజంగా జరిగిన కథ కాదని సినిమా విడుదలైన కొద్దిరోజుల తర్వాత కమల్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసింది. దర్శకుడు సుదీప్తో సేన్ కూడా పరోక్షంగా కమల్‌హాసన్‌ను విమర్శించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై చిత్ర కథానాయిక అదాశర్మ (adah Sharma) స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అదాశర్మ మాట్లాడుతూ ‘‘ది కేరళ స్టోరీ’ సినిమాను విమర్శించిన వారిలో చాలామంది చూడకుండానే కామెంట్స్ చేశారు. కానీ నేనేం బాధపడలేదు. మనదేశంలో ఉన్న వాక్ స్వేచ్ఛకు చాలా సంతోషించాను. ఇక్కడ ఎవరి గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. భిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు మన దగ్గర ఎక్కువ. అదే మన దేశంలో ఉండే అద్భుతమైన విషయం. నేను నా దేశాన్ని ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటాను. ఈ సినిమా గురించి చాలామంది రకరకాల అభిప్రాయాలు చెప్పారు. అది వారి ఇష్టం. ఇదంతా మాకు ఒక ఎక్స్‌పీరియన్స్‌గా ఉపయోగపడుతోంది’’ అని చెప్పింది.