Akshay kumar : సినిమాలు చూసి ఆ ధైర్యాన్ని ఇవ్వండి చాలు...

ABN , First Publish Date - 2023-10-08T15:50:26+05:30 IST

"కథ పరంగా, వాణిజ్య అంశాలు రెండు విధాలుగా హిందీ సినిమాలు మంచి విజయాన్నే అందుకుంటున్నాయని’’ బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ అన్నారు. ‘బాక్సాఫీసు వద్ద నా సినిమాలు ఎలాంటి వసూళ్లను సొంతం చేసుకుంటాయని అడిగి ఇబ్బంది పెట్టకండి.

Akshay kumar : సినిమాలు చూసి ఆ ధైర్యాన్ని ఇవ్వండి చాలు...

"కథ పరంగా, వాణిజ్య అంశాలు రెండు విధాలుగా హిందీ సినిమాలు మంచి విజయాన్నే అందుకుంటున్నాయని’’ బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ (Akshay kumar) అన్నారు. ‘బాక్సాఫీసు వద్ద నా సినిమాలు ఎలాంటి వసూళ్లను సొంతం చేసుకుంటాయని అడిగి ఇబ్బంది పెట్టకండి. దయచేసి నిరుత్సాహపరచకండి. నేను చేసే చిత్రాలు వసూళ్లు ఎలా రాబట్టినా సమాజంలో మార్పును తీసుకొచ్చే సినిమాలు చేయడానికి అభిమానుల ప్రోత్సాహం కావాలి’ అని ఆయన కోరారు. తాజాగా ‘మిషన్‌ రాణీగంజ్‌’తో *Mission Ranigunj) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

మంచి కథ, మసాలా ఎంటర్‌టైనమెంట్‌ ఉన్న ప్రాజెక్ట్స్‌ నేను చేస్తున్నా. ‘మిషన్‌ రాణీగంజ్‌’ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటోంది అని అడిగి ఒత్తిడికి గురిచేయకండి. వాణిజ్య పరంగానూ సినిమాలు చేసి కాసుల వర్షం కురిపించగలను. కానీ సామాజిక అంశాలతో కూడిన చిత్రాలు చేసి సమాజంలో మార్పు తీసుకొచ్చే కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తునందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నా సినిమాకు థియేటర్ల వద్ద ఎలాంటి స్పందన లభిస్తుందోనని ఆలోచించి నన్ను నిరుత్సాహపరచవద్దు. మంచి సినిమాలు తీస్తున్నారు. అవి మా పిల్లలకు కూడా చూపిస్తున్నామని నాకు ధైర్యం చెప్పండి. అంతకు మించినది ఏమీ లేదు.

ఆ టైటిల్‌ ఏంటని ప్రశ్నించారు..

2017లో ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘ప్యాడ్‌ మ్యాన్‌’(2018) లాంటి సినిమాలు చేస్తానని నిర్ణయించుకున్నప్పుడు సామాజిక మార్పును కొరుకునే సినిమాల పట్ల నేను తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నేను ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ సినిమా చేస్తున్నప్పుడు అందరు నన్ను ఏంటి ఆ టైటిల్‌ అని ప్రశ్నించారు. అసలు మీకు అర్థమవుతోందా? టాయ్‌లెట్స్‌ అనే కథనంతో ఎవరైన సినిమాలు తీస్తారా? అని వారిని అడిగాను. వారి దగ్గరినుంచి సమాధానం రాలేదు’’ అని అన్నారు.

Akshay.gif

ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను

కోయంబత్తూర్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్‌లను తయారు చేసిన సామాజిక కార్యకర్త, చిన్న పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనాథం నిజజీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమే ‘ప్యాడ్‌ మ్యాన్‌’. చేతిలో శానిటరీ ప్యాడ్‌ పట్టుకోవడానికి సాహసం చేయని సమయంలో నేను ఆ సినిమా చేశాను. ఆ టైంలో ప్రజలు దానిని తాకడానికి కూడా సిద్థంగా లేరు. ఆ సినిమాతో కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను.

వాళ్లకు అలా అర్థమైయిందేమో...

'ఓ మై గాడ్‌2' చిత్రం ఓటీటీలో రావడం వల్ల దేశంలోని అన్ని మూలాలయువతకు చేరువైతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విడుదల సమయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ మా సినిమాకు ‘ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చిందని వార్తల్లో నిలిచింది. ఎందుకు అలా చేసిందని నేను అడగను. నాకు గొడవ పడడం ఇష్టం లేదు. నాకు వాటి నిబంధనలు గురించి తెలియదు. వారికి ఆ సినిమా అలా అనిపించవచ్చు అందుకే ఎ సర్టిఫికేట్‌ ఇచ్చారు. మేం ఆ సినిమాతో ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పాం. దానిని ఎవరికి చూపించాలనుకున్నామో వాళ్లకు ఆ సినిమా నచ్చింది. నాకు అది చాలు’’ అని అక్షయ్‌కుమార్‌ చెప్పారు.

Updated Date - 2023-10-08T15:50:26+05:30 IST