Alia Bhatt- Ranbir Kapoor: ఏప్రిల్ 14, హ్యాపీ డే.. ఆలియా పోస్ట్ వైరల్
ABN , First Publish Date - 2023-04-14T16:26:47+05:30 IST
మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలియా భట్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో..
ఆలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor)ల వివాహం జరిగి సంవత్సరం అవుతుంది. ఈ కపుల్.. ముందు ప్రేమించుకుని.. తర్వాత పెద్దల అంగీకారంతో గత సంవత్సరం ఏప్రిల్ 14న అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరికి ఇటీవలే ఓ పాప కూడా జన్మించింది. అయితే వివాహం జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఆలియా భట్ తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Alia Bhatt- Ranbir Kapoor First Wedding Anniversary)
‘హ్యాపీ డే’ (Happy Day) అంటూ ఆమె ఇన్స్టాలో మూడు ఫొటోలను షేర్ చేసింది. అందులో ఒక ఫొటో పెళ్లి సమయంలో జరిగిన హల్దీ ఈవెంట్లోది కాగా.. మిగతా రెండు ఫొటోలు వారి పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నప్పటి ఫొటోలుగా తెలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్ ఫొటోలో ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఉంటే.. మరో ఫొటోలో ఆలియాకు రణబీర్ ప్రపోజ్ చేస్తున్నారు. ఇక మూడో ఫొటోలు ఇద్దరూ కౌగిలించుకుని హాయిగా నవ్వుకుంటున్నారు. ఈ ఫొటోలలో వారిద్దరినీ చూసిన అభిమానులు.. పెళ్లిరోజు శుభాకాంక్షలు (Greetings), హ్యాపీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2022, ఏప్రిల్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట.. గతేడాది నవంబర్ 6న ‘రాహా’కు జన్మనిచ్చారు. ఆలియా విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. అందులో ఆమె సీత పాత్రలో కనిపించారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా (Sundeep Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్ ‘యానిమల్’ (Animal) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి:
*********************************
*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది
*Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్
*KGF Actress: ‘కెజియఫ్’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది
*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?