Ayushmann Khuranna: బాలీవుడ్‌లో విషాదం..

ABN , First Publish Date - 2023-05-19T18:38:19+05:30 IST

బాలీవుడ్‌ నటుడు, సింగర్‌ ఆయుష్మాన్‌ ఖురానా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆచార్య పి ఖురానా మరణించారు.

Ayushmann Khuranna: బాలీవుడ్‌లో విషాదం..

బాలీవుడ్‌ నటుడు, సింగర్‌ ఆయుష్మాన్‌ ఖురానా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆచార్య పి ఖురానా మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అనారోగ్య కారణాలతో శుక్రవారం ఆయన పంజాబ్‌లోని మొహాలీలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా.. పి ఖురానా జ్యోతిష్య రంగంలో ప్రావీణ్యం సంపాదించారు. చండీగఢ్‌కు చెందిన ఆయన జ్యోతిష్యంపై పుస్తకాలు కూడా రచించారు. ‘విక్కీ డోనర్‌’ చిత్రంతో ఆయుష్మాన్‌ ఖురానా నటుడిగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇప్పటిదాకా 18 చిత్రాల్లో నటించారు. అంతే కాదు సింగర్‌గా బాలీవుడ్‌లో పలు హిట్‌ చిత్రాలకు పాటలు పాడారు. ఒక జాతీయ పురస్కారం, నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. ఫోర్బ్స్‌ ఇంచి?యా- 2013, 2019 జాబితాలో సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Updated Date - 2023-05-19T18:40:13+05:30 IST