Sunny Deol: ఆక్షన్ నోటీసు వెనక్కి తీసుకున్న బ్యాంకు, అక్షయ కుమార్ హస్తం ఉందా?
ABN , First Publish Date - 2023-08-21T18:09:11+05:30 IST
సన్నీ డియోల్ విల్లా వేలం ప్రకటనను బ్యాంకు వెనక్కి తీసుకుంది, ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తోంది. అలాగే అక్షయ్ కుమార్ ఏమైనా ఇందులో జోక్యం చేసుకొని, ఆ బ్యాంకు ప్రకటన ఉపసంహరించుకునేట్టు చేశారా, ఇంతకీ ఏది నిజం...
దేశంలో ఇప్పుడు వార్తల్లో వున్న వ్యక్తుల్లో సన్నీ డియోల్ (SunnyDeol) ఒకరు. ఒకటి అతని సినిమా 'గదర్ 2' #Gadar2 దేశం అంతా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది, చాలా పెద్ద హిట్ అవటమే కారణం. రెండోది ముంబై (Mumbai) లోని జుహులో వున్న అతని బంగాళా ని వేలం వెయ్యడానికి బ్యాంకు అఫ్ బరోడా (BankOfBaroda) నోటీసు ఇచ్చింది. ఈ రెండిటికి సన్నీ డియోల్ వార్తల్లో వున్నారు. ఆ బ్యాంకు కి సన్నీ రూ. 60 కోట్లు అప్పున్నారు, కట్టలేదు. అందుకని వేలం ప్రకటన ఇచ్చిన బ్యాంకు, ఈరోజు అదే వేలం ప్రకటన (ఆక్షన్ నోటీసు) అనూహ్యంగా ఉపసంహరించుకుంది. ఈరోజు ఇచ్చిన ప్రకటనలో సాంకేంతిక కారణాల వలన చిన్న మార్పు వుంది, అందుకని ఆ వేలం నోటీసు వెనక్కి తీసుకుంటున్నాం అని బ్యాంకు చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే ఇంకో కథనం కూడా ఒకటి బయటకి వచ్చింది. సన్నీ డియోల్ (SunnyDeolVilla) భవనం ఇలా వేలం వెయ్యడానికి ప్రకటన రాగానే ఇంకొక నటుడు అక్షయ్ కుమార్ (AkshayKumar) వెంటనే ఆ డబ్బు తాను కడతానని ముందుకొచ్చినట్టు, అతను సుమారు రూ.30 నుండి రూ. 40 కోట్లు బ్యాంకు కి కట్టినట్టు, ఆ డబ్బులు సన్నీ డియోల్, అక్షయ్ కుమార్ కి తరువాత ఇస్తాను అని చెప్పినట్టుగా, అందుకని బ్యాంకు నోటీసు వాపసు తీసుకుందని ఇలా మరికొన్ని కథనాలు కూడా వచ్చాయి. అక్షయ్ కుమార్ సినిమా 'ఓఎంజి 2' #OMG2 కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఇందులో ఏదీ నిజం లేదు అటు అక్షయ్ తరపు టీము, ఇటు సన్నీ డియోల్ టీము చెప్పారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, అదేంటి అంటే బ్యాంకు అధికారులు మాత్రం తమ ప్రకటనను మాత్రం వెనక్కి తీసుకున్నారు అన్నది నిజం. అయితే ఇందులో అక్షయ్ కుమార్ చేసిందేమీ లేదు. సన్నీ డియోల్ ముందుకొచ్చి కొంత డబ్బు కడతామని చెప్పారని, అందుకనే బ్యాంకు ఆ ప్రకటన వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సన్నీ డియోల్ ఇప్పుడు 'గదర్ 2' #Gadar2 విజయంతో డబ్బులు చాలా గడించారు. ఈ సినిమా ఒక గొప్ప ఇండస్ట్రీ హిట్ దిశగా వెళుతోంది. హిందీలో ఈమధ్య కాలంలో షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan) 'పఠాన్' #Pathaan తరువాత ఇలా హిట్ అయిన సినిమా ఏదీ లేదు.
ముంబైలోని సన్నీ విల్లా భవనంలో సన్నీ డియోల్ ఆఫీస్ వుంది, అలాగే సన్నీ సూపర్ సౌండ్, ప్రివ్యూ థియేటర్, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి అనువుగా ఇంకా చాలా రూమ్స్ వున్నాయి. పరిశ్రమలో ఈ సన్నీ సూపర్ సౌండ్ అనేది చాలా ప్రాముఖ్యం కలది, ఎందుకంటే ఇక్కడే చాలా పెద్ద పెద్ద సినిమాలు తమ సినిమాలు చూసుకుంటూ వుంటారు. అలాగే మీడియా వాళ్ళకి కూడా ఇక్కడే సినిమాలు చూపిస్తారు కూడా. 1980ల్లో మొదలెట్టిన ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఆఫీస్, అంతా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అన్నీ మారుస్తూ వస్తున్నారు.