Chatrapathi: 60 కోట్ల సినిమా నా కొడుకుతో తీయటం తండ్రిగా గర్వపడుతున్నా: బెల్లంకొండ

ABN , First Publish Date - 2023-05-09T21:49:45+05:30 IST

తెలుగు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డెబ్యూ చేస్తున్నాడు 'ఛత్రపతి' సినిమాతో. ఈ శుక్రవారం ఆ సినిమా విడుదల అవుతోంది, అతని గురించి సినిమా గురించి దర్శకుడు వినాయక్, శ్రీనివాస్ తండ్రి సురేష్ ఏమన్నారు అంటే...

Chatrapathi: 60 కోట్ల సినిమా నా కొడుకుతో తీయటం తండ్రిగా గర్వపడుతున్నా: బెల్లంకొండ

ఈ రాబోయే శుక్రవారం తెలుగు సినిమాలతో పాటు, ఇంకో హిందీ సినిమా కూడా విడుదల అవుతోంది. విశేషం ఏంటంటే, ఆ హిందీ సినిమా 'ఛత్రపతి' (Chatrapathi) కావటం, అందులో తెలుగు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హిందీలో ఆరంగేట్రం చెయ్యటం. తెలుగు సినిమా 'ఛత్రపతి' కి రీమేక్ ఇది, అదే టైటిల్ ఉంచారు. శ్రీనివాస్ ని వెండి తెరకి పరిచయం చేసిన దర్శకుడు వి.వి. వినాయకే, (VV Vinayak) అతని మొదటి హిందీ సినిమాకి కూడా దర్శకుడు కావటం ఇంకో విశేషం. "ముందు చాలా ఆలోచించాను, కానీ శ్రీనివాస్ నేనే చెయ్యాలని పట్టుపడితే వొప్పుకొని ఈ హిందీ సినిమా దర్శకత్వం చేసాను," అని చెప్పాడు వినాయక్.

bellamkondasreenivas1.jpg

రాజమౌళి (SS Rajamouli), ప్రభాస్ (Prabhas) తెలుగు 'ఛత్రపతి'లో అద్భుతంగా చేశారు, అందుకని వారు చేసిన దానిని పాడు చేయకుండా ఐకానిక్ సీన్స్ షాట్స్ ఏమీ మార్చకుండా చాలా జాగ్రత్తగా చేశాం, అని చెప్పాడు వినాయక్. చిన్న మార్పు ఏదైనా చెయ్యాలని కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) గారితో మాట్లాడి చాలా జాగ్రత్తగా చేయమని చెప్పాడు.

vvinayaksuresh.jpg

అరవై కోట్లు తో పెన్ పెన్ స్టూడియోస్‌ లాంటి నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేయడం తండ్రి గా నేను ఎంతో గర్వపడే విషయం, అని శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. ప్రచారాలకు సురేష్ కితాబు నిచ్చాడు. నార్త్ లో చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు, తను హిందీలో ఈ సినిమా చేసినా ఇంత బాగా ప్రమోట్ చెయ్యలేను అని చెప్పాడు. మాస్ పల్స్ తెల్సిన వినాయక్ హిందీలో కూడా మా అబ్బాయిని లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది అని చెపుతూ ఇది తెలుగు లో కూడా డబ్ చేయొచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాని హిందీలో చూపిద్దామని వినాయక్ గారు అన్నారు. మన తెలుగు ఆడియన్స్ కూడా మన హీరో హిందీ లో ఎలా చేశాడో అని చూస్తారు అని అన్నారు

Updated Date - 2023-05-09T21:49:45+05:30 IST