Ameesha Patel: బాలీవుడ్ నటికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్

ABN , First Publish Date - 2023-04-07T20:29:21+05:30 IST

బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) వివాదంలో చిక్కుకుంది. చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంది.

Ameesha Patel: బాలీవుడ్ నటికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్

బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) వివాదంలో చిక్కుకుంది. చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంది. ఆమెపై 420, 120 సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. రాంచీలోని సివిల్ కోర్టు అమీషా, ఆమె వ్యాపార భాగస్వామి క్రునాల్‌కు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.

రాంచీ జిల్లాలోని హర్ము ప్రాంత నివాసి అజయ్ కుమార్ సింగ్. అమీషా పటేల్‌ ఆయనను ‘దేశీ మ్యాజిక్’ (Desi Magic) చిత్రంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించింది. ఫలితంగా అజయ్ కుమార్ రూ.2.5కోట్లను అమీషా ఖాతాకు బదిలీ చేశారు. మేకింగ్‌తో పాటు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని సూచించారు. అమీషా 2013లో ప్రాజెక్టును పట్టాలెక్కించింది. సినిమా షూటింగ్‌ను మాత్రం పూర్తి చేయలేదు. ఫలితంగా అజయ్ డబ్బును వెనక్కి ఇవ్వాలని నటిని పలు మార్లు కోరారు. అక్టోబర్ 2018లో అమీషా రూ.2.5కోట్లకు ఒకటి, రూ.50లక్షలకు మరో చెక్‌ను ఇచ్చింది. కానీ, ఈ చెక్స్ బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ సింగ్ ఆమెపై కేసు వేశారు. కేసు విచారణకు వచ్చినప్పటికి ఆమె న్యాయవాది మాత్రం కోర్టు ముందు హాజరు కాలేదు. ఫలితంగా కేసును ఏప్రిల్ 15కు వాయిదా వేశారు.

అమీషా పటేల్‌కు వ్యతిరేకంగా గతంలోను భోపాల్ కోర్టు నాన్ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. సినిమా నిమిత్తం యుటీఎఫ్ టెలీ ఫిలిమ్స్‌ నుంచి రూ.32.25లక్షల డబ్బును ఆమె అప్పుగా తీసుకుంది. చెక్ బౌన్స్ కావడంతో కోర్టు వారెంట్‌ను ఇచ్చింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-07T20:29:22+05:30 IST