ShahRukhKhan: నేను విలన్ అయితే, ఏ హీరో నా ముందు నిలబడలేడు

ABN , First Publish Date - 2023-07-10T12:29:41+05:30 IST

షారుఖ్ ఖాన్ ఈసారి దక్షిణాది నటులు, సాంకేతిక నిపుణలతో పనిచేస్తున్న సినిమా 'జవాన్'. అట్లీ దర్శకుడు, నయనతార, విజయ్ సేతుపతి ఇందులో నటిస్తుండగా, అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ట్రైలర్ ప్రివ్యూ విడుదల అయింది, అదెలా ఉందంటే...

ShahRukhKhan: నేను విలన్ అయితే, ఏ హీరో నా ముందు నిలబడలేడు
Shah Rukh Khan From Jawan

దక్షిణాదికి చెందిన దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) నటించిన 'జవాన్' #Jawan తెలుగు ట్రైలర్ ప్రివ్యూ #JawanOfficialTeluguPrevue విడుదల అయింది. ట్రైలర్ చూస్తే చాలా ఆసక్తికరంగా వుంది. ఇందులో షారుఖ్ ఖాన్ తో పాటు నయనతార (Nayanthara), దీపికా పదుకోన్ (DeepikaPadukone), విజయ్ సేతుపతి (VijaySethupathi) కూడా నటిస్తున్నారు. దక్షిణాదికే చెందిన అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతాన్ని సమకూర్చారు.

nayanthara-jawan.jpg

ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక పూర్తి యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. అయితే ఇందులో షారుఖ్ ఖాన్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్టుగా కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే అతను చెప్పే డైలాగ్ కూడా అలాగే ఉంటుంది. "ఎవరు నేను? ఎవర్ని కాను? తెలియదు? తల్లికిచ్చిన మాట కావచ్చు, నెరవేరని లక్ష్యం కావచ్చు? నేను మంచివాడినా? చెడ్డవాడినా? పుణ్యాత్ముడినా? పాపాత్ముడినా? నీకు నువ్వే తెలుసుకో.... ఎందుకంటే నేనే నువ్వు... రెడీ... " అంటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయింది.

deepikapadukone-jawan.jpg

ఇక ఇందులో ఒకపక్క షారుఖ్ తలకి కట్టుతో కనపడతాడు, ఇంకో పక్క వేరే షారుఖ్ ఫ్రెష్ గా ఉంటాడు. అంటే ఇద్దరు వున్నారు, వుంటారు అని అర్థం అవుతోంది. టైటిల్ చెప్పినట్టుగా 'జవాన్' #Jawan కొంచెం మిలిటరీ నేపధ్యం కూడా వుంది అన్నట్టుగా మిలిటరీ సన్నివేశాలు కూడా చూపించారు. నయనతార ఇందులో ఒక ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తోంది అని అర్థం అవుతోంది. ఆమె కూడా చాలా వైవిధ్యంగా కనపడుతోంది. ఇంకో పక్క బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకోన్ కూడా వుంది. ఈ ఇద్దరూ కూడా పోరాట సన్నివేశాల్లో ఈ ట్రైలర్ లో కనిపించారు అంటే, ఈ ఇద్దరి నేపధ్యం కూడా పోలీస్, మిలిటరీ లేదా అలంటి రహస్య మిషన్ లాంటిది ఏదైనా ఉండొచ్చు అని కూడా అర్థం అవుతోంది.

vijaysethupathi-jawan.jpg

మొత్తం మీద ఈ ట్రైలర్ చూస్తుంటే, ఇది షారుఖ్ ఇంతకు ముందు చేసిన 'పఠాన్' సినిమా కన్నా కొంచెం బాగుంటుంది, అర్థవంతమైన సినిమా అని చెప్పొచ్చు అని అర్థం అవుతోంది. ఈసారి షారుఖ్ దక్షిణాది వారి మీద ఆధారపడ్డాడు అని కూడా అనిపిస్తోంది. అందుకే ఈ సినిమా హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సెప్టెంబర్ 7 న విడుదల అవుతోంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ 12వ తేదీన టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపోజబుల్' అనే సినిమాతో వస్తోంది. సినిమా విడుదలకి షా రుఖ్ అభిమానులతో పాటు, మిగతావాళ్ళు కూడా ఎదురు చూసేంత ఆసక్తికరంగా వుంది ఈ ట్రైలర్. "నేను విలన్ అయితే, ఏ హీరో నా ముందు నిలబడలేడు", అనే డైలాగ్ షారుఖ్ చివర్లో అనటం కూడా బాగుంది.

Updated Date - 2023-07-10T12:29:41+05:30 IST