Ileana D'Cruz: తల్లయ్యాక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ఇల్లీబేబి!

ABN , First Publish Date - 2023-11-25T16:45:25+05:30 IST

గోవా బ్యూటీ ఇలియానా( Ileana D'Cruz) తల్లై రెండు నెలలు పూర్తయింది. తరచూ తన బిడ్డకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ  సోషల్ మీడియా వేదికగా  అభిమానులతో కాసేపు ముచ్చటించింది.

Ileana D'Cruz: తల్లయ్యాక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ఇల్లీబేబి!

గోవా బ్యూటీ ఇలియానా( Ileana D'Cruz) తల్లై రెండు నెలలు పూర్తయింది. తరచూ తన బిడ్డకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ  సోషల్ మీడియా వేదికగా  అభిమానులతో కాసేపు ముచ్చటించింది. త్వరలోనే మళ్లీ తెరపై సందడి చేస్తానని చెప్పింది. ఈ మేరకు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. సింగిల్‌ పేరెంట్‌గా బేబీని ఎలా పెంచగలుగుతున్నారు?అన్న ప్రశ్నకు 'నేను సింగిల్‌ పేరెంట్‌ కాదు' అంటూ తన పార్టనర్‌ ఫోటో షేర్‌ చేశారు ఇల్లీబేబీ.

Mad.jpg

గర్భవతి అని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?

గత ఏడాది ఇదే రోజుల్లో నేను గర్భం దాల్చాను. తల్లి కాబోతున్నానని తెలిసిన ఆ క్షణాలు భావోద్వేగంతో కూడుకున్నవి. నా బేబీ కోవా ఫీనిక్స్‌ డోలన్‌ను హత్తుకున్నప్పుడు..అ అనుభూతి నాకు తెలుస్తుంది. కానీ దానిని మాటల్లో వర్ణించలేను. ప్రెగ్నెంట్‌ అయిన నాటి నుంచి డెలీవరి అయ్యేవరకూ అమ్మ నా పక్కనే ఉన్నారు. అందుకు నేను ఎంతో సంతోషంగా ఫీలయ్యా. తొలిసారి బాబుని చూసిన క్షణాలు ఎంతో అపురూపమైనవి’’ అని చెప్పారు. మీ బిడ్డ విషయంలో కాకుండా మరే విషయంలో మీరు సంతోషంగా ఉన్నారు అని అడగగా ుూనా బేబీ డాడీ విషయంలో’ అని తెలిపింది.

2.jpg

Updated Date - 2023-11-25T16:48:42+05:30 IST