Ileana: ఆ ఫొటోలో ఉన్నది ప్రియుడేనా?

ABN , First Publish Date - 2023-07-17T15:26:17+05:30 IST

గోవా బ్యూటీ ఇలియానా త్వరలో తల్లి కాబోతుంది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిదో నెల. అయితే ఆమె ఎవరితో రిలేషన్‌లో ఉందో ఇప్పటికీ బయటపెట్టలేదు. పెళ్లి ప్రస్తావన లేదు. అయితే తాజాగా ‘డేట్‌ నైట్‌’ అనే క్యాప్షన్‌తో వ్యక్తితో కలిసున్న ఫొటో షేర్‌ చేసింది ఇలియానా. తనెవరో, పేరు ఏంటి అన్నది చెప్పలేదు. దీంతో నెటిజన్లు, అభిమానులు అతని డిటైల్స్‌ చెప్పాలని ఇలియానాను కోరుతున్నారు.

Ileana: ఆ ఫొటోలో ఉన్నది ప్రియుడేనా?

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) త్వరలో తల్లి కాబోతుంది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిదో నెల. అయితే ఆమె ఎవరితో రిలేషన్‌లో ఉందో ఇప్పటికీ బయటపెట్టలేదు. పెళ్లి ప్రస్తావన లేదు. అయితే తాజాగా ‘డేట్‌ నైట్‌’ (Ileana Date night) అనే క్యాప్షన్‌తో వ్యక్తితో కలిసున్న ఫొటో షేర్‌ చేసింది ఇలియానా. తనెవరో, పేరు ఏంటి అన్నది చెప్పలేదు. దీంతో నెటిజన్లు, అభిమానులు అతని డిటైల్స్‌ చెప్పాలని ఇలియానాను కోరుతున్నారు. అయితే ఇలియానా నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల బేబీమూన్‌కు వెళ్లొచ్చిన ఇలియానా.. తన ఇన్‌స్టాలో ప్రియుడిని ఉద్దేశించి చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తానే నాలో ధైర్యం నింపాడు. ఎన్నో సందర్భాల్లో అండగా నిలిచాడు. కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచా నవ్వుల మయం చేశాడు. ఎప్పుడు ఏం కావాలో అర్థం చేసుకున్నాడు. అతడు పక్కన ఉంటే నాకు ఏదీ కష్టంగా అనిపించదు అని రాసుకొచ్చింది. (Ileana boy friend photos Viral)

అంతే కాదు మాతృత్వం గురించి కూడా ఇలియానా చెప్పుకొచ్చింది. ‘‘తల్లి కావడమనేది ఒక గొప్ప అనుభూతి. నాలో మరో జీవి ప్రాణం పోసుకుంటుందనే అనుభూతి ఎంతో అద్భుతంగా ఉంది. దీనిని మాటల్లో వర్ణించలేకపోతున్నా’’ అంటూ బేబీబంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది ఇలియానా.

Ileyana.jpg

Updated Date - 2023-07-17T15:32:35+05:30 IST