Janhvi Kapoor : టీనేజ్‌లోనే ఆ సమస్యలు ఎదుర్కొన్నా..!
ABN , First Publish Date - 2023-09-30T16:34:26+05:30 IST
హీరోయిన్స్ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యపదజాలాలతో పోస్ట్‌లు పెట్టడం సోషల్ మీడియాలో కామన అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిపోయింది. తాజాగా ఈ విషయంపై అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) స్పందించింది.
హీరోయిన్స్ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యపదజాలాలతో పోస్ట్‌లు పెట్టడం సోషల్ మీడియాలో కామన అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిపోయింది. తాజాగా ఈ విషయంపై అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) స్పందించింది. టీనేజ్‌లో తను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాని చెప్పుకొచ్చింది. ఇంటర్‌నెట్‌తో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని పదేళ్ల వయసులోనే తెలుసుకున్నా. అప్పట్నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపింది జాన్వీ.
ఆమె మాట్లాడుతూ ‘‘నేను, చెల్లి ఏ ఫంక్షనకు వెళ్లినా అనుమతి లేకుండా మా ఫొటోలు తీసేవారు. వద్దని వారించిని వినేవారు కాదు. అలాగని గట్టిగా మాట్లాడితే.. మీడియాపై ఫైర్ అయిన శ్రీదేవి కూతురు’ అని అదొక తలనొప్పి. అయితే కొన్నాళ్లకు అది మాకు అలవాటైపోయింది. పదేళ్ల వయసులో ఎవరో నా ఫొటో తీసి కాబోయే హీరోయిన్ అంటూ వెబ్‌సైట్స్‌లో పెట్టారు. అది చూసిన తర్వాత చాలామంది స్నేహితులు దూరమయ్యారు. ఆ తర్వాత నా టీనేజ్ *Teenage) ఫొటో తీసి మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్స్‌లో (porn sites) పెట్టారు. ఇలాంటి చూసి చాలా బాధపడేదాన్ని. ఏఐతో అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఈ సమస్య మరింత పెరిగింది. చాలామంది ఆడపిల్లలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోర్న్ సైట్స్‌లో మార్ఫింగ్ ఫొటోలు చూసి చాలామంది అదే నిజమని నమ్ముతున్నారు. ఇలాంటి విషయాలు కుటుంబ సభ్యులకు తెలిస్తే వారి మనసు ఎంతో నొచ్చుకుంటుంది. ఇలాంటి విషయంతెలిసినప్పుడు నాకు చాలా ఆందోళనగా ఉంటుంది’’ అని జాన్వీకపూర్ చెప్పారు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. ఎన్టీఆర్(NTR) హీరోగా తెరకెక్కుతున్న దేవర’ (Devara) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతుంది. తెలుగులో ఆమెకిది తొలి చిత్రమిది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసింది. భవిష్యత్తులో తెలుగులో ఎన్నో చిత్రాలు చేయాలనుందనీ, హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుంటానని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే!