Kajol Clarity: విద్య ప్రాముఖ్యత గురించి తెలియజేసే క్రమంలో.. అలా..
ABN , First Publish Date - 2023-07-09T17:49:47+05:30 IST
బాలీవుడ్ నటి కాజోల్ (kajol) కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. దానిపై తాజాగా కాజోల్ స్పందించారు.
బాలీవుడ్ నటి కాజోల్ (kajol) కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. దానిపై తాజాగా కాజోల్ స్పందించారు. ఇటీవల కాజోల్ నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’(Lust stories2) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. అందులో ఆమె పోషించిన బోల్డ్ క్యారెక్టర్‌పై కూడా విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే? ప్రస్తుతం ఆమె ‘ది ట్రైల్’ (The Trail) అనే సిరీస్ చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజోల్ మహిళా సాధికారిత గురించి మాట్లాడారు. ‘‘సమాజంలో మార్పు ఎంతో అవసరం. కానీ ఇండియాలాంటి దేశంలో మార్పు చాలా నిదానంగా జరుగుతోంది. ఎందుకంటే, సంప్రదాయాలు, ఆలోచనా విధానంతో మనం నిమగ్నమైపోయాం. ఇది విద్యపై ప్రభావం చూపుతోంది. విద్యావ్యవస్థపై సరైన అవగాహన లేని రాజకీయ నాయకులు మనకు ఉన్నారు. ఇలా చెబుతున్నందుకు క్షమించాలి. మనల్ని పాలించే చాలామంది నేతలకు విద్యా విధానంపై ఆలోచన లేదు’’ అని ఆమె అన్నారు. (kajol clarity)
ఆ వ్యాఖ్యలు కాస్త తీవ్ర చర్చకు దారి తీశాయి. పలువురు రాజకీయ నాయకులు కాజోల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పుడు దానిపై కాజోల్ స్పందించారు. ‘‘విద్య ప్రాముఖ్యత గురించి తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ నాయకులను తక్కువ చేసి చూడాలనేది నా ఆలోచన కాదు. దేశాన్ని సరైన అభివృద్థి దిశగా నడుపుతున్న కొంతమంది గొప్ప నాయకులు కూడా మనకు ఉన్నారు. నా వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అర్ధం చేసుకున్నారు’’ అంటూ కాజోల్ క్లారిటీ ఇచ్చారు.