Nawazuddin Siddiqui: మానసిక కుంగుబాటుకు కారణం అదే!
ABN , First Publish Date - 2023-05-20T20:23:06+05:30 IST
వివాహ బంధంలో ఎదురైన సమస్యలతో ఇటీవల వార్తల్లో నిలిచారు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన మానసిక కుంగుబాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివాహ బంధంలో ఎదురైన సమస్యలతో ఇటీవల వార్తల్లో నిలిచారు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui. తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన మానసిక కుంగుబాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిటీల్లో జీవించేవాళ్లే.. ఆందోళన, మానసిక కుంగుబాటును ఎక్కువగా అనుభవిస్తుంటారని ఆయన అన్నారు. ‘‘మానసికంగా బాధగా అనిపిస్తుందని మా నాన్నతో చెబితే ఆయన తప్పకుండా నన్ను కొడతారు. ఎందుకంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండే చోటు నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసినంతవరకూ డిప్రెషన్ అనేది నగరాల్లో నివసించే వారికే సంబంధించిన విషయం. గ్రామాల్లో ఉండేవారికి డిప్రెషన్ అంటే ఏమిటో తెలియదు. గ్రామాల్లో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఇక, నగరాల్లో జీవించేవారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా భావోద్వేగానికి గురవుతుంటారు. నేను కూడా సిటీలోకి అడుగుపెట్టిన తర్వాతే.. మానసిక కుంగుబాటు, ఆందోళన వంటి విషయాలను తెలుసుకున్నాను’’ అని నవాజుద్దీన్ అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా తన భార్య ఆలియా సిద్ధిఖీకు దూరంగా ఉంటున్నారు. నవాజుద్దీన్ మానసికంగా హింసిస్తున్నాడనీ, తనను, పిల్లల్ని ఇంట్లోకి రానివ్వడం లేదని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కావాలని పోలీసులను కోరింది. (Bollywood actor)
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో వెంకటేశ్ (venatesh) హీరోగా తెరకెక్కుతోన్న ‘సైంధవ్’లో (Saindhav) విలన్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్లో ఆయన నటిస్తున్న తొలి చిత్రమిది.