Shah Rukh Khan : అది కావాలంటే.. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోండి

ABN , First Publish Date - 2023-09-28T12:35:38+05:30 IST

ఈ ఏడాది ప్రారంభం నుంచే విజయపరంపరలో ఉన్నారు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah rukh Khan). జనవరిలో ‘పఠాన్‌’(pathan)తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన ‘జవాన్‌’(Jawan)తో మరో మాసీవ్‌ హిట్‌ అందుకున్నారు.

Shah Rukh Khan : అది కావాలంటే.. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోండి

ఈ ఏడాది ప్రారంభం నుంచే విజయపరంపరలో ఉన్నారు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah rukh Khan). జనవరిలో ‘పఠాన్‌’(pathan)తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన ‘జవాన్‌’(Jawan)తో మరో మాసీవ్‌ హిట్‌ అందుకున్నారు. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి మరోసారి బాద్‌షా అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘డంకీ’ (Dunki) చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ చేశారు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఓ లేడీఫ్యాన్‌ అయితే విచిత్రమైన కోరిక కోరింది. సోషల్‌ మీడియా వేదికగా ‘మీ డింపుల్‌పై ముద్దు పెట్టుకోవచ్చా?’ అని అడిగింది. దానికి షారుక్‌ ఏం సమాధానిమిచ్చారు తెలుసా? సర్‌.. మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా? అన్న ప్రశ్నకు.. కుడి వైపుదా? ఎడమ వైపుదా? ఏదైనా దయచేసి అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోండి’ అని సమాధానమిచ్చారు షారుక్‌.

నిద్రలేవగానే మీరు చేసే మొదటి పని ఏంటి?

నా కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటా. ‘జవాన్‌’ సినిమా కోసం లక్షల్లో ఫ్యాన్స్‌ థియేటర్స్‌ దగ్గర సందడి చేశారు. నేను ఇంతమందిని అలరించగలిగానా అని అనిపిస్తుంది. ఆ క్షణాల్లో ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నటుడిగా ఇంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఈ చిత్రంలో నాకు అన్ని సీన్స్‌ ఇష్టమే. ఎక్కువగా క్లైమాక్స్‌ నచ్చింది.

డంకీ ఎలా ఉండబోతోంది. అభిమానులు ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?

‘డంకీ’ భావోద్వేగాలతో కూడిన ఎంటర్‌టైనర్‌. నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. రాజ్‌కుమార్‌ హిరాణీ ప్రపంచంలో యాక్షన్‌ సన్నివేశాలని కూడా ఉండొచ్చు. ఆయన మంచి దర్శకుడే కాదు.. గొప్ప ఎడిటర్‌ కూడా. ఇంతకుమించి ఈ చిత్రం గురించి ఇంకేం చెప్పలేను. 2024లో ఏదైనా మాస్‌ సినిమా చేస్తారా? అని అడుగుతున్నారు. కానీ నేను చాలా క్లాస్‌ హీరోని కదా?

Untitled-1.jpg

సోషల్‌ మీడియాలో జరిగే ఫ్యాన్స్‌ వార్‌ విషయంలో మీ అభిమానులని ప్రశాంతంగా ఉండేలా ఓ సలహా ఇవ్వండి?

ఇది నిజంగా మంచి ఆలోచన. అందరం సహనం, గౌరవంతో ఉండాలి, ఎవరిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించవద్దు. ప్రేమను మాత్రమే పంచాలి.

షారుక్‌ సర్‌.. ‘జవాన్‌’ టికెట్స్‌ కోసం వెళ్తే అన్ని చోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిచ్చాయి.

మీ ప్రియమైన వారితో కలిసి మీరు చూడాలనుకుంటే తగిన ఏర్పాట్ల గురించి నేను చూసుకుంటా.

‘డంకీ’ రిలీజ్‌ డేట్‌ గురించి?

అనుకున్న తేదీనే డిసెంబరు 22న వస్తుంది.

Updated Date - 2023-09-28T12:35:38+05:30 IST