Nora Fatehi: ఆ నటుడు, నేను అందరి ముందే జుట్లు పట్టుకుని కొట్టుకున్నాం.. సంచలన విషయాలు వెల్లడించిన బాలీవుడ్ బ్యూటీ
ABN , First Publish Date - 2023-03-02T14:07:23+05:30 IST
ఎవరి జీవితాల్లోనైనా గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు బహిరంగంగానే జుట్టు జుట్టు పట్టుకొని గొడవపడిన సందర్భాలు కూడా కొందరికీ జరిగి ఉంటాయి.
ఎవరి జీవితాల్లోనైనా గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు బహిరంగంగానే జుట్టు జుట్టు పట్టుకొని గొడవపడిన సందర్భాలు కూడా కొందరికీ జరిగి ఉంటాయి. దీనికి సెలబ్రిటీలు అతీతులేం కాదు. తన జీవితంలో జరిగిన అలాంటి ఓ సంఘటన గురించి ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహీ (Nora Fatehi) తాజాగా వెల్లడించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా మాట్లాడుతూ.. ‘‘నా మొదటి సినిమా ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్’ షూటింగ్‌ని బంగ్లాదేశ్‌లోని దట్టమైన అడవుల్లో జరిగింది. ఆ సమయంలో ఓ నటుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో కోపం వచ్చి అతని చెంప చెళ్లుమనిపించాను. అతను కూడా నా చెంప మీద కొట్టాడు. అనంతరం అతను నా జుట్టు పట్టుకున్నాడు. నేను అతని జుట్టు పట్టుకున్నా. అలా ఒకరి జుట్టు ఒకరం పట్టుకుని కొట్టుకున్నాం. అది దారుణమైన గొడవ. అది చూసిన మా దర్శకుడు వచ్చి మా ఇద్దరినీ ఆపాడు’’ అని చెప్పుకొచ్చింది.
అయితే.. ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్’ (Roar: Tigers of the Sundarbans) చిత్రంతో 2014లో నోరా ఫతేహి వెండితెరకి పరిచయమైంది. అయితే మెయిన్ లీడ్స్ కంటే ఎక్కువగా ఐటమ్స్ సాంగ్స్ చేస్తూ పాపులారిటీ సాధించింది. ఈ భామ చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. అందుకే ఈ బ్యూటీని అభిమానులు డ్యాన్సింగ్ క్వీన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ‘బాహుబలి’ (Bahubali) సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్‌తో ఈ భామకి దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ లభించింది. అనంతరం ‘టెంపర్’, ‘కిక్ 2’ చిత్రాల్లోనూ ఐటమ్ నంబర్స్‌తో అలరించింది.
ఇవి కూడా చదవండి:
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు
Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్