Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-05-03T13:39:39+05:30 IST

పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాను త్వరలో వివాహం చేసుకోబోతోంది. ఈ లోపు వారిద్దరూ కలిసి.. చేయాల్సిన వన్నీ చేసేస్తున్నారు. అంటే

Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ఎప్పుడంటే?
Parineeti Chopra and Raghav Chadha

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) త్వరలో పెళ్లిపీటలు (Marriage) ఎక్కబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ అన్నాక.. ప్రేమించదా? పెళ్లి చేసుకోదా? దీనిలో పెద్ద విశేషం ఏముంది అని అంతా అనుకోవచ్చు కానీ.. తన వృత్తికి సంబంధించని వారితో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతున్నప్పుడు అందులో ఎంతో కొంత విశేషం ఉంటుంది కదా. ఇప్పుడు పరిణీతి చోప్రా విషయంలో, ఆమె పెళ్లి విషయంలో వార్తలు వైరల్ అవుతుంది అందుకే. ఆమె ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ చద్దా (Raghav Chadha)ను త్వరలో వివాహం చేసుకోబోతోంది. ఈ లోపు వారిద్దరూ కలిసి.. చేయాల్సిన వన్నీ చేసేస్తున్నారు. అంటే డిన్నర్ డేట్స్, లంచ్ మీటింగ్స్.. ఇలా ఎక్కడ చూసినా ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అలా వారిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇద్దరూ ఇప్పటి వరకు ఎక్కడా ప్రేమలో ఉన్నట్లుగానీ, పెళ్లి చేసుకోబోతున్నట్లుగానీ తెలపలేదు.

కానీ వీరిద్దరి నిశ్చితార్థానికి (Parineeti Chopra and Raghav Chadha Engagement) సంబంధించి న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా సర్కిల్స్‌లో బాగా హల్చల్ చేస్తోంది. పరిణీతి చోప్రా, రాఘవ చద్దాల నిశ్చితార్థం మే 13వ తేదీన ఢిల్లీ (Delhi)లో గ్రాండ్‌గా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు బాలీవుడ్ మీడియా (Bollywood Media)లో వైరల్ అవుతున్నాయి. మే 13న నిశ్చితార్థం ముగించుకున్న ఈ జంట.. అక్టోబర్‌ చివరి వారంలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉన్నట్లుగా వారి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ లోపు ఈ జంట ప్రేమలో విహరించాలనేలా ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించి గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే వారి నిశ్చితార్థానికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Chopra.jpg

పరిణీతి చోప్రా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమెకు చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. ‘ఛమ్కీలా (Chamkila), క్యాప్య్సుల్ గిల్ (Capsule Gill)’ అనే సినిమాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన పరిణీతి చోప్రా.. దానిని అందుకోలేకపోయింది. ప్రస్తుతం అవకాశాలు కూడా తగ్గడంతో.. ఇలా ఆప్ ఎంపీతో పెళ్లికి సిద్ధమైందనేలా ఆమెపై బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్

*Vimanam: మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనబడుతున్నాయ్..

*I am Salman: సల్మాన్ ఖాన్ ఇలా మారిపోయాడేంటి? గ్రూట్ ఎంత పని చేశావ్..

*JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..

*Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్

* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!

Updated Date - 2023-05-03T13:39:39+05:30 IST