Parineethi Chopra : ప్రియాంక రాలేనందుకు తల్లి స్పందన!
ABN , First Publish Date - 2023-09-25T16:35:49+05:30 IST
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడు అడుగులు వేశారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పరిణీతి సోదరి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడు అడుగులు వేశారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. అయితే పరిణీతి సోదరి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో బీటౌన్‌లో, సన్నిహితుల్లో రకరకాల రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు.
‘‘పరిణీతి పెళ్లి చాలా బాగా జరిగింది. నూతన దంపతులు ఎంతో అందంగా ఉన్నారు. సినిమాలకు సంబంధించి గతంలో ఇచ్చిన డేట్స్ ఒప్పందం కారణంగా ప్రియాంక చోప్రాఈ వివాహానికి రాలేకపోయింది. కేవలం ఆశీర్వాదం ఇేస్త చాలని, పెళ్లికి వచ్చే అతిథులు బహుమతులు తీసుకురాకూడదనే కండీషన్ పెట్టారు’ అని మధు చోప్రా తెలిపారు.
ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ పెళ్లిలో పరిణీతి ఎంతో సందడి చేసింది. బావను ఆడ పట్టించే బాధ్యతను పరిణీతి తీసుకుంది. ప్రియాంక కూడా పరి పెళ్లిలో అంతే సందడి చేస్తుందని అభిమానులు భావించారు. అయితే ప్రియాంక చోప్రా మిస్ కావడంతో అభిమానులు నిరాశపడ్డారు. అయితే నూతన వధూవరులకు ప్రియాంక చోప్రా శుభాకాంక్షలు తెలిపారు. పరిణితీ, రాఘవ్ చద్దాల ఫొటో షేర్ చేసిన ప్రియాంక.. ‘ప్రియమైన సోదరి.. నా దీవెనలు నీకు ఎప్పటికీ ఉంటాయి’ అని పేర్కొంది.