Ram Mandir Inauguration: లక్ష్మణ పాత్రధారి అంత ముఖ్యం కాదనుకున్నారేమో!

ABN , First Publish Date - 2023-12-16T16:10:50+05:30 IST

అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

Ram Mandir Inauguration: లక్ష్మణ పాత్రధారి అంత ముఖ్యం కాదనుకున్నారేమో!

అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర (Ram Mandir Inauguration) ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే, రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదని ‘రామాయణ్‌’ (Ramayan) ధారావాహికలోని లక్ష్మణ పాత్రధారి సునీల్‌ లాహ్రీ (Sunil lahri) తెలిపారు

‘‘ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు అందరనీ పిలవాలని రూల్‌ లేదు. ఒకవేళ వాళ్లు నన్ను పిలిచి ఉంటే ఎంతో సంతోషించేవాడిని. తప్పకుండా ఆ కార్యక్రమానికి వెళ్లేవాడిని. రాముడి పాత్ర పోషించిన అరుణ్‌ గోవిల్‌, సీత పాత్ర పోషించిన దీపిక చిఖాలియాకు ఆహ్వానాలు అందాయి. లక్ష్మణ పాత్ర అంత ముఖ్యం కాదనుకున్నారేమో, లేదంటే వ్యక్తిగతంగా వాళ్లకు నేనంటే ఇష్టం లేదేమో అందుకే ఆహ్వానం పంపించలేదనుకుంటా. నాకు మాత్రమే కాదు.. ‘రామాయణ్‌’ సీరియల్‌కు పనిచేసిన సిబ్బందిలో ఎవరినీ ఆహ్వానించలేదు. అది నాకు కాస్త బాధగా అనిపించింది’’ అని సునీల్‌ లాహ్రీ అన్నారు. మూడు దశాబ్దాల క్రితం రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ధారావాహిక ‘రామాయణ్‌’కు అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. అంతేకాదు కరోనా, లాక్‌డౌన సమయంలో రీ టెలికాస్ట్‌ చేసినప్పుడు కూడా.. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ధారావాహికను ఆదరించారు.

Updated Date - 2023-12-16T16:13:51+05:30 IST