Salman Khan: 17 సెంచరీలు.. బాలీవుడ్ మెగాస్టార్ ఖాతాలో అరుదైన రికార్డ్
ABN , First Publish Date - 2023-11-14T20:50:14+05:30 IST
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇతరులెవరికీ సాధ్యం కానీ మరో ఆరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010 నుంచి సల్మాన్ నటించిన 17 సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్‌లో ఇంతవరకు ఏ హీరోకు సాధ్యం కానీ ఫీట్‌ను సాధించాడు.
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇతరులెవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సల్మాన్ తాజా చిత్రం ‘టైగర్ 3’ (Tiger3) దీపావళి సందర్భంగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా విడుదలైన ప్రతిచోటా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతూ రెండు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.
ఈక్రమంలో బాలీవుడ్‌లో అత్యధికంగా వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల హీరోగా సల్మాన్ ఖాన్ ట్రెండ్ సెట్ చేశాడు. 2010లో తన ప్రోడక్షన్ హౌస్‌లో వచ్చిన ‘దబాంగ్’ సినిమా నుంచి మొదలైన ఈ విజయ పరంపర ఈ దీపావళికి విడుదలైన ‘టైగర్3’ వరకు మొత్తంగా 17 సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్‌లో ఇంతవరకు ఏ హీరోకు సాధ్యం కానీ ఫీట్‌ను అధిరోహించాడు. కరోనా అనంతరం 2021లో వచ్చిన ‘రాధే’ ఓటీటీలో విడుదల కాగా, ‘అంతిమ్’ థియేటర్లలో విడుదలై పరాజయం పాలయ్యాయి.
2010లో వచ్చిన దబాంగ్ రూ. 141.24 కోట్లు, 2011లో వచ్చిన రెడీ రూ. 120.82 కోట్లు, 2011లో వచ్చిన బాడీగార్డ్ రూ. 148.86 కోట్లు , 2012లో వచ్చిన ఏక్ థా టైగర్ రూ. 198.78 కోట్లు, 2012లోనే వచ్చిన దబాంగ్ 2 రూ. 155 కోట్లు, 2014లో వచ్చిన జై హో (2014) రూ. 116 కోట్లు, 2014లో ఈద్‌కు వచ్చిన కిక్ రూ.402.85 కోట్లు 2015లో వచ్చిన బజరంగీ భాయిజాన్ రూ. 969.06 కోట్లు, 2015 దీపావళికి వచ్చిన ప్రేమ్ రతన్ ధన్ పాయో రూ. 431.37 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఇక 2016లో వచ్చిన సుల్తాన్ రూ. 623.33 కోట్లు, 2017లో వచ్చిన ట్యూబ్‌లైట్ రూ. 121.25 కోట్లు, 2017లోనే వచ్చిన టైగర్ జిందా హై రూ. 565.1 కోట్లు, 2018లో వచ్చిన రేస్ 3 రూ. 303 కోట్లు, 2019లో వచ్చిన భారత్ రూ. 325.58 కోట్లు, 2019లోనే వచ్చిన దబాంగ్ 3 రూ. 230.93 కోట్లు, 2023 రంజాన్‌కు వచ్చిన కిసీ కా భాయ్ కీ జాన్ 182.44 కోట్లు వసూలు చేసి మరే హీరోకు దక్కని అరుదైన గుర్తింపు పొందాడు.