Samantha: ప్రతి పోరాటంలో నాతోనే ఉన్నారు!
ABN , First Publish Date - 2023-07-13T17:43:33+05:30 IST
మయోసైటిస్ సమస్య నుంచి కోలుకుని మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు సమంత. ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం పూర్తి కావొచ్చింది. మరోవైపు హిందీలో నటిస్తున్న వెబ్‌సిరీస్ సిటాడెల్’ కూడా పూర్తి చేశారామె!
మయోసైటిస్ సమస్య నుంచి కోలుకుని మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు సమంత (Samantha). ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషి’ (Kushi) చిత్రం పూర్తి కావొచ్చింది. మరోవైపు హిందీలో నటిస్తున్న వెబ్‌సిరీస్ సిటాడెల్’ కూడా పూర్తి చేశారామె! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తన చిత్రాలకు సంబంధించి ఏదో ఒక ఆసక్తికర అప్డేట్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంటారు. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లతో వార్తల్లో నిలిచారు. ‘ఆరు నెలలుగా చాలా కష్టపడుతున్నా. ఇక మూడు రోజులే ఈ కారావ్యాన్‌లో ఉండేది’.. అంటూ ఇన్‌స్టా స్టోరీలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. తాజాగా సెల్ఫీతో సామ్ మరో పోస్ట్ చేసింది. (Samantha viral post)
‘‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజుతో ‘సిటడెల్’ వెబ్‌సిరీస్ పూర్తయింది. ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది మనకు చెడు చేస్తుంది అనుకోకూడదు. రాజ్ అండ్ డీకే టీమ్ తెలియకుండా నాతో కలిసిన కుటుంబం. వీరి అవసరం నాకెంతో ఉంది. నేను ఎదుర్కొన్న ప్రతి యుద్ధంలోనూ నన్ను వదిలిపెట్టకుండా ఎంతో సహకరించారు. ప్రపంచం గర్వించే స్థాయిలో మీరుండాలని కోరుకుంటున్నా. జీవితకాలం గుర్తుండే పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకోసం మరో పాత్ర రాసే వరకూ ఇదే నా బెస్ట్’’ అని సమంత పేర్కొంది.
కొన్ని రోజులుగా సమంత సినిమాలకు ఏడాది విరామం తీసుకోనుందనే వార్త వైరలవుతున్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆమె సైన్ చేసిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసింది. తన తర్వాత సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్ చెబుతుందా.. లేదంటే విరామం ప్రకటిస్తుందా.. అనే టాక్ నడుస్తోంది. ‘సిటాడెల్’ విషయానికొస్తే.. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పారఽతధారులుగా నటించిన వెబ్ సిరీస్. దీనిని ఇండియన్ వెర్షన్లో వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రధారులుగా రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.