Shah Rukh Khan: 'జవాన్' లో ఆ పదం తీసెయ్యమన్నారు, సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది
ABN , First Publish Date - 2023-08-23T12:52:20+05:30 IST
షా రుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వస్తున్నా 'జవాన్' ని సెన్సార్ పాస్ చేసింది. యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో మొత్తం ఏడు కట్స్ చెప్పగా, వాటిని వేరే పదాలతో మార్చినట్టుగా తెలిసింది. ఈ సినిమా నిడివి ఎంత, ఎటువంటి కట్స్ చెప్పారో తెలుసా...
షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) నటించిన పెద్ద బడ్జెట్ చిత్రం 'జవాన్' #Jawan సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమా చూసి యు/ఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చి పాస్ చేశారు. తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7 న విడుదలవుతోంది. షా రుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ (GauriKhan) ఈ సినిమాకి నిర్మాత. ఇందులో నయనతార (Nayanthara), దీపికా పడుకునే (DeepikaPadukune) కథానాయకురాలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికీ వైరల్ అయ్యాయి, అలాగే ఈ సినిమా చాలా అంచనాలతో అన్ని భాషల్లో విడుదలవుతోంది.
అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాలో ఏడు చోట్ల కట్స్ చెప్పినట్టుగా తెలిసింది. ఆలాగే కొన్ని పదాలను కూడా తీసెయ్యమన్నారు, కొన్నిటిని వేరే పదాలతో మార్చమన్నారు. ఇందులో హింసాత్మకంగా వుండే ఒక సన్నివేశంలో ఒకతని తల నరికే సన్నివేశాన్ని తీసెయ్యమన్నారు, అలాగే రాష్ట్రపతి పదాన్ని కూడా తొలగించామన్నారు అని తెలిసింది. రాష్ట్రపతికి బదులు 'హెడ్ అఫ్ ది స్టేట్' అని మార్చారు. అలాగే మంతం ఏడు చోట్ల కొన్ని మాటలు లో వచ్చే పదాలు, మాటలు కూడా మార్చాలి వచ్చిందని తెలిసింది.
అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) ఎక్కడ వచ్చినా తీసెయ్యమన్నారు, దానికి బదులు ఐ.ఐ.ఎస్.జి (IISG) అని మార్చారు. ఇవన్నీ చేంజ్ చేసి తీసుకువచ్చాక, సెన్సార్ బోర్డు ఈ 'జవాన్' సినిమాకి యూ/ఏ తో క్లియరెన్స్ ఇచ్చిన్నట్టుగా తెలిసింది. ఈ మార్పులు అన్నీ చేసాక ఈ సినిమా నిడివి సుమారు 169 నిముషాలు వచ్చిందని తెలిసింది. అంటే రెండు గంటల 49 నిముషాలు నిడివి ఉంటుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి (VijaySethupathi) ఇందులో ఒక ప్రధాన పాత్రలో కనపడతాడు.