Shah rukh khan: ఆపరేషన్ తర్వాత ఇండియాకు!
ABN , First Publish Date - 2023-07-04T15:59:11+05:30 IST
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ప్రమాదం జరిగినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్ ప్రమాదానికి గురయ్యారని, ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని వార్తలొస్తున్నాయి. వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారని.. షూటింగ్‌కు బై చెప్పి ఇండియాకు వచ్చేశారని సన్నిహితుల నుంచి సమాచారం.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు (Shah rukh khan)ప్రమాదం జరిగినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్ ప్రమాదానికి గురయ్యారని, ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని వార్తలొస్తున్నాయి. వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారని.. షూటింగ్‌కు బై చెప్పి ఇండియాకు వచ్చేశారని సన్నిహితుల నుంచి సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. (Shah rukh khan injured)
ప్రస్తుతం షారుక్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ‘జవాన్’ (Jawan) చిత్రం చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ ేసతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రధారులు. ఈ చిత్రం దీపికా పడుకోన్ అతిథిగా సందడి చేయనున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ‘డుంకీ’ చిత్రంలోనూ షారుక్ నటిస్తున్నారు.