Sunil Shetty: అల్లుడు కాదు.. కుమారుడు!
ABN , First Publish Date - 2023-02-13T19:25:22+05:30 IST
బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి ఆనందంలో మునిగి తేలుతున్నారు. అందుకు కారణం అతియాశెట్టి ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను వివాహమాడారు. ఈ మేరకు సునీల్ తాజాగా ఇంటర్వ్యూలో రాహుల్ అంటే తనకు ఎంత ప్రేమో చెప్పుకొచ్చారు
బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి (Sunil shetty) ఆనందంలో మునిగి తేలుతున్నారు. అందుకు కారణం అతియాశెట్టి (athiya shetty) ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను (Ka rahul) వివాహమాడారు. ఈ మేరకు సునీల్ తాజాగా ఇంటర్వ్యూలో రాహుల్ అంటే తనకు ఎంత ప్రేమో చెప్పుకొచ్చారు. ‘‘రాహుల్ నాకు అల్ల్లుడు. నేను మాత్రం అతన్ని కుమారుడిలా చూస్తాను. ఇప్పుడు నా కుమార్తెతో పెళ్లి అయింది కాబట్టి నేను తనకు మామని అయ్యాను. దానికంటే ముందు నేను అతడికి అభిమానిని. తన ఆటను, ప్రతిభను ఇష్టపడే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. కష్టపడే తత్వం ఉన్న వాళ్లను చూసి నేను ఎంతో గౌరవిస్తాను. తన ప్రతికదలికను ఇష్టపడతా’’ అని అన్నారు. రాహుల్ - అతియాశెట్టి ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ పెదల అంగీకారంతో ఈ జంట జనవరి 23న పెళ్లి చేసుకున్నారు.