Vijay Varma - Tamannah: అందరి నుంచి అదే ప్రశ్న!

ABN , First Publish Date - 2023-07-21T20:07:36+05:30 IST

తమన్నా(Tamannah)తో డీప్‌ లవ్‌లో ఉన్నాడు విజయ్‌వర్మ(Vijay varma). చాలాకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే తమన్నా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయ్‌తో ప్రేమ ఎలా పుట్టిందో చెప్పుకొచ్చారు.

Vijay Varma - Tamannah: అందరి నుంచి అదే ప్రశ్న!

తమన్నా(Tamannah)తో డీప్‌ లవ్‌లో ఉన్నాడు విజయ్‌వర్మ(Vijay varma). చాలాకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే తమన్నా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయ్‌తో ప్రేమ ఎలా పుట్టిందో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు విజయ్‌పై ఇంటి నుంచి పెళ్లి ఒత్తిడి పెరిగిందట. తన తల్లి ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌..’ అని తన తల్లి తరచూ అడుగుతున్నారట, ఈ విషయాన్ని విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్‌ ఉంది. పెళ్లి గురించి ఇంకా ఏమీ ఆలోచించడం లేదు’’ అని తెలిపారు. (marriage pressure)

Untitled-1.jpg

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మా కమ్యూనిటీలో 16 ఏళ్లకే అబ్బాయిలకు పెళ్లి చేసేస్తారు. కాబట్టి, వివాహం విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం సర్వసాధారణం. ఇప్పటికీ మా అమ్మ ఫోన్‌ చేసిన ప్రతిసారి పెళ్లి గురించే మాట్లాడుతుంటుంది. నేనే ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నా. ఎందుకంటే, ప్రస్తుతం నా జీవితం చాలా బాగుంది. సంతోషంగా ముందుకు సాగుతుంది. పూర్తిగా కెరీర్‌పైనే నా దృష్టి పెట్టా’’ అని తెలిపారు. ‘ఎంసీఏ’తో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన విజయ్‌ ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’తో అలరించారు. ఈ సిరీస్‌ షూట్‌లోనే ఆయనకు నటి తమన్నాతో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

Updated Date - 2023-07-21T20:07:36+05:30 IST