Matti Katha: ‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు
ABN , First Publish Date - 2023-06-10T21:54:42+05:30 IST
మనుషులకు మట్టితో ఉండే అనుబంధాన్ని.. మట్టి విలువను కథాంశంగా బేస్ చేసుకుని తెరకెక్కించిన సినిమా ‘మట్టి కథ’. ఈ సినిమాకు అంతర్జాతీయంగా అవార్డుల పంట పండుతోంది. తాజాగా ఈ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూడు అవార్డులు దక్కించుకుంది.
తెలంగాణ (Telangana) పల్లెలోని యువకుడి కథను.. పల్లె వాతావరణంలో తెరకెక్కించిన సినిమా ‘మట్టి కథ’ (Matti Katha). మనుషులకు మట్టితో ఉండే అనుబంధాన్ని.. మట్టి విలువను కథాంశంగా తీసిన ‘మట్టి కథ’ సినిమాకు అంతర్జాతీయంగా అవార్డుల పంట పండుతోంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Indo French International Film Festival 2023)లో ఈ సినిమా మూడు అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్ (Best Indian Feature Film), బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ (Beast Actor Feature Film) కేటగిరీల్లో విజేతగా నిలిచింది. అదే విధంగా డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫ్యూచర్ ఫిల్మ్ (Debut Filmmaker of Feature Film) కింద ఈ సినిమా ఎంపికైంది.
‘మట్టి కథ’కు ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్స్ రావడంతో.. ఒక్కసారి ఈ సినిమాపై అటెన్షన్ పెరుగుతోంది. ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇటీవల ‘బలగం’ (Balagam) సినిమాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో నటుడు ప్రియదర్శి ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే కేటగిరీలో ‘మట్టి కథ’ సినిమా హీరో అజయ్ వేద్.. ఉత్తమ నటుడిగా ఎంపిక కావటం మూవీపై అంచనాలను పెంచేస్తోంది. అంతే కాదు.. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. మమ్మనీతమ్ అనే తమిళ సినిమాకు హీరో విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమాల సరసన ఇప్పుడు మట్టి కథ చేరడంతో చిత్రయూనిట్ చాలా హ్యాపీగా ఉంది.
కాగా.. పవన్ కడియాల (Pawan Kadiyala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. అజయ్ వేద్ (Ajay Ved) హీరోగా నటించగా.. అన్నపరెడ్డి అప్పిరెడ్డి (Annapareddy Appireddy) నిర్మించారు. సహ నిర్మాతగా సతీశ్ మంజీర వ్యవహరించారు. ప్రముఖ జానపద గాయని కనకవ్వ, ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు ఇంటికి వెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో.. పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి.. మట్టిలోని మధురానుభూతి ఎలా ఉంటుంది అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించారని.. ఇటీవల ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. (3 International Awards to Matti Katha Film)
ఇవి కూడా చదవండి:
************************************************
*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్
*************************************************************
*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
***********************************
*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి
**************************************************************
*Megha Akash: అవన్నీ వదంతులే.. మేఘా ఆకాష్ డేటింగ్ వార్తలపై తల్లి క్లారిటీ
*Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం
*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను