Harom Hara: ఫస్ట్ ట్రిగ్గర్‌తో.. పాన్ ఇండియా వైడ్‌గా మోత మోగిస్తున్న సుధీర్ బాబు

ABN , First Publish Date - 2023-05-10T21:17:46+05:30 IST

గురువారం హీరో సుధీర్ బాబు పుట్టినరోజు (Sudheer Babu Birthday).. ఈ సందర్భంగా అడ్వాన్స్ విశెష్ తెలియజేస్తూ మేకర్స్- ఫస్ట్ ట్రిగ్గర్ (First Trigger) పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ట్రిగ్గర్ ఎలా ఉందంటే..

Harom Hara: ఫస్ట్ ట్రిగ్గర్‌తో.. పాన్ ఇండియా వైడ్‌గా మోత మోగిస్తున్న సుధీర్ బాబు
Sudheer babu in Harom Hara

సుధీర్ బాబు (Sudheer Babu) పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’ (Harom Hara). సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) దర్శకత్వంలో ఎస్ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ Sree Subrahmanyeshwara Cinemas) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు (Sumanth G Naidu) నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్’ (The Revolt) అనేది సినిమా ట్యాగ్‌లైన్. గురువారం హీరో సుధీర్ బాబు పుట్టినరోజు (Sudheer Babu Birthday).. ఈ సందర్భంగా అడ్వాన్స్ విశెష్ తెలియజేస్తూ మేకర్స్- ఫస్ట్ ట్రిగ్గర్ (First Trigger) పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ట్రిగ్గర్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌‌గా మోత మోగుతోంది. ఇందులో..

‘‘రేడియోలో వాతావరణ రిపోర్ట్‌తో వీడియో ప్రారంభమైంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తారు. అతని ముఖం కనిపించనప్పటికీ సుధీర్ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తారు. చివరగా అతని తుపాకీ నుండి ఫస్ట్ ట్రిగ్గర్ విడుదలౌతుంది. ‘అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు... కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది... ఇది నాకేదో సెప్తావుంది...’ అని సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగ్ అదరగొట్టాడు. మాండలికం, అతని వాయిస్ బేస్ పాత్రకు ఇంటెన్స్ తెస్తుంది. (Harom Hara First Trigger)

Sudheer-babu.jpg

సుధీర్ బాబు సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఫస్ట్ ట్రిగ్గర్ పూర్తిగా యాక్షన్‌తో నిండివుంది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘హరోం హర’ కథ 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతుంది. విజువల్స్ ఈ గ్లింప్స్‌లో హైలెట్ అనేలా ఉన్నాయి. అలాగే చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాములుగా లేదు. సరికొత్త ఫీల్‌ని ఇస్తోంది. క్రిస్మస్ సెలవులను పురస్కరించుకుని.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ ఈ వీడియోలో అనౌన్స్ చేశారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?

*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం

*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు

*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

*Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు

*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

Updated Date - 2023-05-10T21:17:46+05:30 IST