Game On: దసరా థియేటర్స్‌లో ‘గేమ్ ఆన్’ అవుతోంది

ABN , First Publish Date - 2023-04-01T22:45:12+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీ ఆడుతున్న థియేటర్లలో (Dasara Theaters) ఈ టీజర్ ప్రదర్శితమవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో

Game On: దసరా థియేటర్స్‌లో ‘గేమ్ ఆన్’ అవుతోంది
Game On Movie Stills

గీతానంద్ (Geethanand), నేహా సోలంకి (Neha Solanki) (90 ఎంఎల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’ (Game On). క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటిస్తున్న సినిమా ఇది. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీ ఆడుతున్న థియేటర్లలో (Dasara Theaters) ఈ టీజర్ ప్రదర్శితమవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. టీజర్‌కు మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. (Game On Movie Teaser)

ఈ సందర్బంగా నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ, “గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి స్పందన వచ్చింది. నవాబ్ గ్యాంగ్ మా సినిమా కోసం చక్కని సంగీతం అందించారు. తాజాగా విడుదల చేసిన టీజర్ నాని హీరోగా నటించిన దసరా సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతుండటంతో చాలా ఆనందంగా ఉంది. స్పందన అద్భుతంగా ఉంది. ఈ స్పందనతో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు.

దర్శకుడు ద‌యానంద్ మాట్లాడుతూ ‘‘రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ ఇది. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావడమే కాదు.. స‌క్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి. టీజర్‌ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని తెలిపారు. (Game On Movie)

Updated Date - 2023-04-01T22:45:14+05:30 IST