Gopichand32: గోపీచంద్ 32వ చిత్రం ఆ దర్శకుడితోనే.. ఓపెనింగ్ కూడా పూర్తయింది
ABN , First Publish Date - 2023-09-09T15:45:23+05:30 IST
‘మాచో స్టార్’ గోపీచంద్ నటించనున్న 32వ చిత్రానికి సంబంధించి వివరాలు వచ్చేశాయ్. శ్రీనువైట్ల దర్శకత్వంలోనే గోపీచంద్ తదుపరి చిత్రం ఉండబోతుంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా శనివారం పూర్తయ్యాయి. ఈ సినిమా చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కబోతోంది.
‘మాచో స్టార్’ గోపీచంద్ (Macho Star Gopichand) నటించనున్న 32వ చిత్రానికి సంబంధించి వివరాలు వచ్చేశాయ్. శ్రీనువైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలోనే గోపీచంద్ తదుపరి చిత్రం ఉండబోతుంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా శనివారం పూర్తయ్యాయి. ఈ సినిమా చిత్రాలయం స్టూడియోస్ (Chitralayam Studios) ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కబోతోంది. మాస్, ఫ్యామిలీస్‌ని మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.
సినిమా నిర్మాణం పట్ల ప్యాషన్ ఉన్న వేణు దోనేపూడి.. ప్రముఖ తారాగణం, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించేందుకు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో కొత్త ప్రొడక్షన్ హౌస్ చిత్రాలయం స్టూడియోస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి చిత్రం ‘గోపీచంద్32’ కావడం విశేషం. ఈ సినిమాలోని చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో లావిష్‌గా తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం గ్రాండ్‌గా నిర్వహించారు. (Gopichand 32 Film Launched)
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ముహూర్తం షాట్‌కు మైత్రి నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు, మరికొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుందని నిర్మాత తెలిపారు. కాగా.. శ్రీనువైట్ల రూపొందించిన పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ అందిస్తుండగా.. ఇతర టెక్నికల్ టీమ్‌ను త్వరలోనే మేకర్స్ ఎంపికచేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
============================
*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో
*********************************
*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్
**********************************
*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..
**********************************
*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు
**********************************