Hi Nanna: ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-10-03T15:32:28+05:30 IST

‘దసరా’ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హాయ్ నాన్న’పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. డిసెంబర్ 21న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేసి.. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. తాజాగా సెకండ్ సింగిల్ గాజు బొమ్మను అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు.

Hi Nanna: ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల ఎప్పుడంటే..
Hi Nanna Movie Still

‘దసరా’ (Dasara) విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) చేస్తున్న పాన్ ఇండియా (Pan India) మూవీ ‘హాయ్ నాన్న’ (Hi Nanna)పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. డిసెంబర్ 21న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేసి.. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ గాల చార్ట్ బస్టర్ నెంబర్ ‘సమయమా’ (Samayamaa)తో ప్రారంభమైయింది. ఈ పాట లీడ్ పెయిర్ -నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని చూపించింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్‌ (Second Single)ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘గాజు బొమ్మ’ (Gaaju Bomma) అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ క్యూట్ వీడియోని నాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

Hi-Nanna-1.jpg

ఈ వీడియోలో నాని, కియారా ఖన్నా ముచ్చటగా మాట్లాడుకుంటూ.. గాజు బొమ్మ పాటను అనౌన్స్ చేశారు. ‘లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్.. మరి మన సాంగ్ ? అని బేబీ కియారా (Baby Kiara Khanna) నానిని అడుగుతుంది. నాని పాపని గాజు బొమ్మ అని పిలుస్తాడు. తండ్రి కూతురు నేపధ్యంలోని ఈ పాట ‘హాయ్ నాన్న’ సోల్‌గా ఉండబోతోందని తెలుస్తుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన ‘ఖుషి’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. (Hi Nanna Second Single Update)


Hi-Nanna-2.jpg

‘హాయ్ నాన్న’ చిత్రంతో శౌర్యువ్ (Shouryuv) దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC డీవోపీగా, ప్రవీణ్ ఆంథోని ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?

**************************************

*Yendira Ee Panchayithi Trailer: పైసాకైనా.. పడకకైనా.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే!

*************************************

*R Narayana Murthy: పేపరు లీకేజీలపై పీపుల్ స్టార్ ఎక్కుపెట్టిన అస్త్రం ఎప్పుడంటే..

**************************************

*Anasuya: మా ఆయన అప్పుడప్పుడు చేస్తారు.. నేను మాత్రం ప్రేమగా చేస్తా..!

**************************************

*Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది

************************************

Updated Date - 2023-10-03T15:32:28+05:30 IST