Japan: అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా!
ABN , First Publish Date - 2023-10-19T15:57:51+05:30 IST
హీరో కార్తీ, ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ కాంబినేషన్లో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘జపాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా విడుదల కాబోతోన్న ఈ పాన్ ఇండియా చిత్ర టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
హీరో కార్తీ (Karthi) పేరు వినగానే విభిన్నమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన చేసే సినిమాలు రొటీన్‌గా కాకుండా.. కాస్త కొత్తదనం నిండి ఉంటాయి. తాజాగా ఆయన ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ (Raju Murugan) దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రమైన ‘జపాన్’ (Japan)లో చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ పాన్ ఇండియా ఎంటర్టైనర్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
టీజర్ విషయానికి వస్తే.. ‘‘హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువల చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ అర్డర్ ఏం చేస్తుంది? ఈ దొంగతనం స్టయిల్ చూస్తే జపాన్ ది లానే అనిపిస్తుంది. ఇండియా అంతటా జపాన్‌పై 182 కేసులు వున్నాయి. నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు. జపాన్ రేంజే వేరు. అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా’’.. ఇలా డిఫరెంట్ పాత్రలు జపాన్ కోసం చెప్పే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్లో అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కార్తి డిఫరెంట్ గెటప్స్ నెక్స్ట్ లెవల్లో వున్నాయి. ఎక్స్ట్రార్డినరీ లుక్స్, పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులని ఆకర్షించాడు కార్తీ. చివర్లో ‘ఎన్ని బాంబులు వేసిన ఈ జపాన్ ఎవరూ ఏం పీకలేర్రా’ అని కార్తీ చెప్పిన డైలాగ్, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా వుంది. (Japan Teaser Talk)
అలాగే టీజర్లో సునీల్ (Sunil) చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఇంత వరకు సునీల్ ఇలా కనిపించలేదు. దర్శకుడు రాజు మురుగన్ ఇంట్రస్టింగ్ గ్రిప్పింగ్ నేరేషన్‌తో కథపై క్యురియాసిటీ పెంచారు. జివి ప్రకాష్ కుమార్ నేపధ్యం సంగీతం బ్రిలియంట్ గా వుంది. ఫిలోమిన్ రాజ్ ఈ టీజర్‌ను క్రిస్ప్ అండ్ షార్ఫ్‌గా కట్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు మరో మంచి సినిమాగా ‘జపాన్’ నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) హీరోయిన్గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి:
============================
*Family Star Glimpse: ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరెన్ వంచాలా ఏంటి?
*********************************
*Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..
********************************
*VK Naresh: చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం
**********************************
*Telusu Kada: నాని క్లాప్‌తో సిద్దు జొన్నలగడ్డ సినిమా మొదలైంది.. తెలుసు కదా!
**********************************