Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-06-16T12:47:49+05:30 IST

‘ఆదిపురుష్’ సినిమా మేకర్స్ మొదటి నుంచి నమ్ముతూ వస్తున్న ఓ సెంటిమెంట్‌ని.. తాజాగా ఓ వానరం నిజం చేసింది. ఈ సినిమా ఆడుతోన్న ఓ థియేటర్‌లోకి వానరం ప్రవేశించి కాసేపు సినిమాని వీక్షించింది. సడెన్‌గా వానరం అలా థియేటర్‌లోకి రావడంతో.. సినిమా చూస్తున్న ఆడియెన్స్ అందరూ జైశ్రీరామ్ అంటూ నినాదాలు అందుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్
Monkey in Adipurush Theater

‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా మేకర్స్ మొదటి నుంచి ఓ సెంటిమెంట్‌ని బలంగా నమ్ముతూ వస్తున్నారు. శ్రీరాముడు (Sri Rama) ఎక్కడుంటే.. అక్కడ హనుమంతుడు (Lord Hanuma) ఉంటాడని భావిస్తూ.. ‘ఆదిపురుష్’ ప్రదర్శించబడుతున్న ప్రతి థియేటర్‌లో ఓ ఛైర్‌ని ఆయన కోసం ఖాళీగా వదిలిపెడుతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఖాళీగా ఉంచకుండా.. ఆ కుర్చీలో హనుమంతుడి ఫొటో లేదంటే ప్రతిమను పెట్టి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లుగా ఇప్పటికే కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ సెంటిమెంట్ నిజమే అనేలా.. ఇప్పుడు ఆదిపురుష్ ప్రదర్శించబడుతోన్న ఓ థియేటర్‌లోకి ఓ వానరం (Monkey) వచ్చి కాసేపు సినిమాని వీక్షించింది. ‘ఆదిపురుష్’ సినిమాని వానరం వీక్షిస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో వానరం థియేటర్ సైడ్ వాల్‌లో ఉన్న హోల్‌లోకి వచ్చి అక్కడ కాసేపు ఉండి.. సినిమాను చూస్తూ ఉంది. సడెన్ థియేటర్‌లో వానరం ప్రత్యక్షమవడంతో.. సినిమా చూస్తున్న వారంతా ఒక్కసారిగా నిలబడి.. ‘జైశ్రీరామ్’ (Jai Shri Ram) అంటూ నినాదాలు అందుకున్నారు. దీంతో నిజంగానే హనుమంతుడు ఈ సినిమా చూడడానికి వచ్చాడనే వారి నమ్మకం నిజమైనట్లుగా మేకర్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పుడీ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై కొందరు నెగిటివ్‌గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది కావాలనే చేశారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. నిజానిజాలు ఏమిటనేది ఆ శ్రీరాముడికే ఎరుకలే కానీ.. జనాలు మాత్రం సెంటిమెంట్‌కి బాగా కనెక్ట్ అయ్యారనేది మాత్రం.. ఈ వీడియో షేర్ అవుతున్న విధానాన్ని చూస్తుంటే తెలుస్తోంది.

Adipurush-1.jpg

భారతీయుల పవిత్ర ఇతిహాసమైన రామాయణాన్ని (Ramayana) ఆధునిక సాంకేతిక సొగసులతో నేటి తరానికి అందించడానికి తెరకెక్కించినట్లుగా చెబుతున్న ఈ ‘ఆదిపురుష్’లో శ్రీరాఘవుడిగా ప్రభాస్ (Prabhas), జానకి (Janaki)గా కృతిసనన్ నటించారు. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Adipurush: ‘ఆదిపురుష్’ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

**************************************

*King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను


**************************************

*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..


**************************************

*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!

**************************************

*SJ Suryah: అమితాబ్ బచ్చన్‌ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..

Updated Date - 2023-06-16T12:47:49+05:30 IST