S Thaman: సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే..
ABN , First Publish Date - 2023-07-31T17:03:22+05:30 IST
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. తమిళ దర్శకుడు, నటుడైన సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. సినిమా సక్సెస్ సాధించడంతో చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో థమన్ చెప్పుకొచ్చారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. తమిళ దర్శకుడు, నటుడైన సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించగా.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.థమన్ (S Thaman) సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం జూలై 28న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ‘వకీల్ సాబ్, భీమ్లా నాయక్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వచ్చిన ఈ ‘బ్రో’తో పవర్ స్టార్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభను (Bro Success Meet) ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎస్. థమన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా రిజల్ట్‌తో చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నా ధైర్యం, నా బలమైన త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. ‘వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ’.. ఇలా వరుసగా పవర్ స్టార్ సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటాను. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్‌గారే. సముద్రఖనిగారు నాకు 20 ఏళ్ళ ముందు నుంచే తెలుసు. ఆయన మట్టి మనిషి. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన ఎంత బాగుంటుందో అంత స్వచ్ఛంగా ఉంటారు. ఈ సినిమా వల్ల ఆయనతో నా అనుబంధం మరింత బలపడింది.
పునీత్ రాజ్ కుమార్‌గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డాను. అంత ఇష్టం సాయి అంటే. మనసుకి చాలా దగ్గరైన మనిషి. అందుకే సాయి తేజ్ సినిమాకి మనసుతో పని చేస్తాను. క్లైమాక్స్‌లో నా సంగీతంతో సాయి తేజ్‌పై ప్రేమని చూపించాను. పవర్‌స్టార్‌ని టైమ్‌గా చూస్తూ నేపథ్య సంగీతాన్ని మరింత బాధ్యతతో చేశాను. ఇంతమంచి సినిమాని ఇచ్చిన సముద్రఖనిగారికి థ్యాంక్స్’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?
**************************************
*Brahmanandam: ఇదిగో సీఏం గారూ.. మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి
**************************************
*Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’
**************************************
*Allu Aravind: డైరెక్టర్ మారుతి కుమార్తె టాలెంట్‌కి అల్లు అరవింద్ ఫిదా
**************************************