NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్

ABN , First Publish Date - 2023-04-10T21:12:49+05:30 IST

కేవలం పోస్టర్, రిలీజ్ అప్‌డేట్స్‌కే ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక రిలీజ్‌ రోజు నందమూరి ఫ్యాన్స్‌ని పట్టుకోవడం ఎవరితరం కాదేమో..

NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్
Aadi Re Release Update

అమ్మతోడు.. రీ రిలీజ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేందుకు వచ్చేస్తున్నా.. అన్నట్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమాల రీ రిలీజ్ (Re Release) ప్రకటనలు వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (Global Star NTR) పుట్టినరోజును పురస్కరించుకుని.. మే 20వ తేదీన ‘సింహాద్రి’ (Simhadri 4K) చిత్రాన్ని 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు, ఓ గ్లిమ్స్ వీడియోని కూడా విడుదల చేశారు. సరికొత్త సౌండింగ్‌తో, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ (Man of The Masses NTR) ట్యాగ్‌తో ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌కు అసలు, సిసలైన మాస్ ట్యాగ్ వేసిన ‘ఆది’ (Aadi) చిత్రాన్ని కూడా ఈ బర్త్‌డే‌కి విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ‘ఆది’ రీ రిలీజ్‌కు సంబంధించి ఓ విశిష్టత కూడా ఉంది. అదే ‘NTR 2 NTR Birthday’.

Jr-NTR.jpg

‘NTR 2 NTR Birthday’ అంటే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నుంచి సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) వరకు.. అర్థం కాలేదు కదా! ‘ఆది’ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20వ తేదీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ జయంతి (NTR Jayanthi) అయిన మే 28 వరకు థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను దున్నెయ్యరా మనవడా అని జూనియర్‌ ఎన్టీఆర్‌ను సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వదించి పంపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. ‘సింహాద్రి 4K’, ‘ఆది’ రీ రిలీజ్‌ల అప్‌డేట్‌తో నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Fans) సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ పేరును బీభత్సంగా ట్రెండ్ చేస్తున్నారు. కేవలం పోస్టర్, రిలీజ్ అప్‌డేట్స్‌కే ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక రిలీజ్‌ రోజు నందమూరి ఫ్యాన్స్‌ని పట్టుకోవడం ఎవరితరం కాదేమో..

Tarak.jpg

‘ఆది’ సినిమా విషయానికి వస్తే.. బెల్లకొండ సురేష్ (Bellamkonda Suresh) సమర్పణలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ (Sri Lakshmi Narasimha Productions) బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించారు. సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా (Keerthi Chawla) హీరోయిన్‌గా నటించగా రాజన్ పి దేవ్ విలన్‌గా నటించారు. దివంగత నటుడు చలపతిరావు ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో నటించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించగా పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. మొత్తంగా మనవడి పుట్టినరోజు వేడుకలు.. అలాగే తాత శత జయంతి ఉత్సవాలతో.. మే నెల నందమూరి నెల (Nandamuri Month)గా మారబోతుందనేది మాత్రం ఈ అప్‌డేట్స్‌తో తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

*MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం

*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..

*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు

*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

Updated Date - 2023-04-10T21:49:14+05:30 IST