Adipurush: ఆదిపురుష్ ఆగమనానికి ఇంకా ఎన్ని రోజులంటే?

ABN , First Publish Date - 2023-01-17T19:57:03+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Global Star Prabhas)తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (OmRaut) తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన..

Adipurush: ఆదిపురుష్ ఆగమనానికి ఇంకా ఎన్ని రోజులంటే?
Adipurush

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Global Star Prabhas)తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (OmRaut) తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్.. సినిమాపై భారీ క్రేజ్‌‌కి కారణమైతే.. రీసెంట్‌గా వచ్చిన టీజర్ పెద్ద వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఈ టీజర్‌ చూసిన వారంతా.. ఇదొక యానిమేషన్ సినిమాలా ఉందంటూ కామెంట్స్ చేయడంతో.. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని మరికొంత కాలం పాటు వాయిదా వేసి.. రిపేర్లు మొదలెట్టారు. ఈ రిపేర్లకే దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా కూడా ఈ మధ్య వార్తలు వినిపించాయి. దీంతో ఈ చిత్రం విడుదల విషయంలో అనేకానేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించడమే కాకుండా.. ఇంకా ఎన్ని రోజులలో ‘ఆదిపురుష్’ ఆగమనం ఉంటుందో కూడా తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ‘జై శ్రీరామ్..’ అంటూ ‘మరో 150 రోజులలో ఆదిపురుష్ ద్వారా శ్రీరాముని బోధనలు మీ ముందుకు రాబోతున్నాయి’ అని తెలిపారు. 16 జూన్ 2023న Imax, 3Dలో ఈ చిత్రం విడుదల కాబోతోన్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ఈ అప్‌డేట్‌తో ప్రస్తుతం ఆదిపురుష్ ట్యాగ్ (#Adipurush) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Updated Date - 2023-01-17T19:57:05+05:30 IST