2018: కేరళ వరదలతో.. కలెక్షన్ల సునామీ
ABN , First Publish Date - 2023-05-26T20:53:24+05:30 IST
ఈ మధ్య కేరళలో విడుదలై.. ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం ‘2018’. ఈ చిత్రం తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైంది. నిర్మాత బన్నీ వాస్ ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రీమియర్ షోస్‌తోనే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
ఈ మధ్య కేరళ (Kerala)లో విడుదలై.. ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం ‘2018’. ఈ చిత్రం తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైంది. నిర్మాత బన్నీ వాస్(Bunny Vas) ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడ వంటి పట్టణాలలో ప్రీమియర్ షోస్‌తో ప్రారంభమైన ఈ చిత్రం కేరళలో ఎలా అయితే టాక్‌ని సొంతం చేసుకుందో.. తెలుగు రాష్ట్రాలలోనూ అదే టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి.. నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేయడం విశేషం.
ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. దర్శకుడు సెకండాఫ్‌లో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌లో కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించినట్లుగా.. ఆ వరదల్లో ప్రేక్షకుడు చిక్కుకున్నట్లుగా అనిపిస్తుందని విమర్శకులు సైతం వర్ణిస్తూ.. దర్శకుడు ప్రతిభను మెచ్చుకుంటున్నారు. కేరళలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుందని, రానున్న రోజుల్లో ఈ సినిమా బుకింగ్స్ మరింతగా పెరుగుతాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
2018లో కేరళని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితులు ప్రాణాల కోసం చేసిన పోరాటాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ (Jude Anthany Joseph) రూపొందించాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో కేరళలో సునామీలా కలెక్షన్స్‌ని రాబడుతోంది. హృద్యమైన కథతో తెరకెక్కిన ఈ 2018 మూవీ విడుదలైన అన్ని చోట్లా ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. ఇందులో టోవినో థామస్ (Tovino Thomas), ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*K Vasu: మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు కె. వాసు మృతి
*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు
*Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం
*TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?
*Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు