R Narayana Murthy: పేపరు లీకేజీలపై పీపుల్ స్టార్ ఎక్కుపెట్టిన అస్త్రం ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-10-02T19:25:39+05:30 IST
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను సరిగా రీచ్ కాకపోవడంతో మరోసారి ఈ చిత్రాన్ని పీపుల్ స్టార్ విడుదల చేయబోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు.
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూనివర్సిటీ’ (University). ఈ సినిమా ఆ మధ్య విడుదలై.. అనుకున్నంతగా ప్రేక్షకులలోకి వెళ్లలేకపోయింది. కానీ ఇందులో పీపుల్ స్టార్ చెప్పిన పాయింట్.. ఇప్పుడు తెలంగాణలో బర్నింగ్ పాయింట్‌గా మారడంతో.. మరోసారి ఆయన ఈ ‘యూనివర్సిటీ’ అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తాజాగా ఆయన హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. (University Release Date)
ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఈ ‘యూనివర్సిటీ’ చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. కీర్తిశేషులు స్వర్గీయ గద్దర్‌గారు, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్, ములుగు విజయ్ గొప్పగా రాశారు. యూనివర్సిటీలలో పేపరు లీకేజీలు (Paper Leakage), గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ ప్రశ్న పత్రాల్లోనూ పేపరు లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు చేస్తూ ఉంటుంటే.. రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కొట్టుకుంటూ ఊపిరాడక నెల రాలుతుంటే.. కన్న తల్లితండ్రులు ఏమై పోవాలి? వాళ్లకు పాఠాలు బోధించిన గురువులు ఏమి కావాలి?
రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా.. నాగసాకి, హీరోషిమాల మీద వేసిన ఆటంబాంబులు కంటే.. హైడ్రోజెన్ బాంబుల కంటే. టొర్నాడో టార్పిడోల కంటే, సునామీల కంటే చాలా ప్రమాదకరమైనది కాపీయింగ్. చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషేంట్ బ్రతుకుతాడా? సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తే అది కాదు మళ్ళీ సెంచరీ చేయండి అంటే చేయగలరా? ఇంజినీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా.. కూలి పోతుంది. విద్యావ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అవుతుంది. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీగారూ (Narendra Modi) దయచేసి ఇవ్వండి సార్. సింగరేణి సంస్థను కూడా ప్రయివేటీకరణ చేయాలని అనుకుంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం ప్రయివేటీకరణ చేసుకొంటూ పోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? విద్యార్థులు జాతి సంపద.. వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది.. ప్రభుత్వాల మీద ఉంది.. మన అందరి మీద ఉంది అని చెప్పే చిత్రమే ఇది. అందుకే అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని గొప్పగా విడుదల చేయాలని సంకల్పించానని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
============================
*Anasuya: మా ఆయన అప్పుడప్పుడు చేస్తారు.. నేను మాత్రం ప్రేమగా చేస్తా..!
**************************************
*Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది
************************************
*L2 Empuraan: ‘లూసిఫర్ 2’కు లైకా కనెక్షన్.. ఈసారి మాములుగా ఉండదట!
************************************
*Vijay Antony: పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. చిన్నకుమార్తెతో కలిసి విజయ్ ఆంటోని ఏం చేశాడంటే..
*************************************