Gam Gam Ganesha: ఆనంద్ దేవరకొండ సినిమాకు మరోసారి నేషనల్ క్రష్ సపోర్ట్
ABN , First Publish Date - 2023-10-04T19:59:01+05:30 IST
‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడదే ఉత్సాహంతో ‘గం..గం..గణేశా’ అనే మూవీని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘బృందావనివే’ అనే లిరికల్ సాంగ్‌ను స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ద్వారా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
‘బేబీ’ (Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda).. ఇప్పుడదే ఉత్సాహంతో ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) అనే మూవీని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన టచ్ చేయని యాక్షన్ కామెడీ జానర్‌తో ‘గం..గం..గణేశా’ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘బృందావనివే’ (Brundavanive Song) అనే లిరికల్ సాంగ్‌ను స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ద్వారా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇంతకు ముందు ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ (Premistunna) సాంగ్‌ని రష్మిక మందన్నా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ కంటే ‘బృందావనివే’ పాట బిగ్ హిట్ కావాలని రష్మిక కోరుతూ.. చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలియజేసింది. తమ సినిమాలోని పాటను రిలీజ్ చేసిన రష్మిక (Rashmika)కు ఆనంద్ దేవరకొండతో పాటు చిత్రయూనిట్ థాంక్స్ చెప్పారు. బ్యూటీఫుల్ మెలొడీ సాంగ్ ‘బృందావనివే’ పాట అందరికీ నచ్చుతుందని ఆనంద్ దేవరకొండ తన ట్వీట్లో పేర్కొన్నారు.
‘బృందావనివే’ పాట విషయానికి వస్తే.. చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) కంపోజ్ చేసిన ఈ పాటకు వెంగి సుధాకర్ లిరిక్స్ అందించారు. సిధ్ శ్రీరామ్ (Sid Sriram)తో కలిసి సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. ‘బృందావనివే యవ్వనివే నీవే, నా మనసే నీ వశమే రా, ప్రేయసివే ఊర్వశివే నీవే, ఆరాధనమైనావే...’ అంటూ మంచి లవ్ ఫీల్‌తో బ్యూటీఫుల్ మెలొడీగా చేతన్ భరద్వాజ్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాట అందరికీ నచ్చుతుందని సినిమాని కూడా త్వరలోనే థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
============================
*Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?
***********************************
*Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
********************************
*Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది
*********************************
*TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు
***********************************
*Siddharth: తెలుగులో సిద్ధార్థ్ సినిమాని ఎవరు చూస్తారని అన్నారట.. సిద్ధార్థ్ ఏడ్చేసినంత పనిచేశాడు
**********************************