Regina Cassandra: నిజంగా రెజీనానేనా.. మరీ అలా ఉందేంటి?

ABN , First Publish Date - 2023-08-04T17:23:20+05:30 IST

2012లో రిలీజైన ‘ఎస్ఎంఎస్’ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ‘నేనేనా’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాని ఆగస్ట్ 18న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Regina Cassandra: నిజంగా రెజీనానేనా.. మరీ అలా ఉందేంటి?
Regina Cassandra in Nenenaa

2012లో రిలీజైన ‘ఎస్ఎంఎస్’ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా (Regina Cassandra). తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రాలతో మంచి విజయాలను కూడా అందుకుంది. అయితే కొంతకాలంగా మాత్రం ఆమెకు అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. అందుకు కారణాలు ఏమైనప్పటికీ.. మంచి అవకాశం కోసం రెజీనా వేచి చూస్తుంది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న చిత్రం ‘నేనేనా’ (Nenenaa).


Regina-Pic.jpg

ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్‌లో ‘సూర్పనగై’ అనే సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘నేనేనా’ అనే పేరుతో విడుదల కాబోతోంది. అక్షర గౌడ, అలీ ఖాన్, జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ‘జాంబిరెడ్డి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో పాటు.. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెజీనా పిక్స్.. సినిమాపై ఇంట్రస్ట్‌ను కలుగజేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. (Nenenaa Movie Ready to Release)

Regina-Pic-2.jpg

అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘నేనేనా’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికేట్‌ను సెన్సార్ సభ్యులు ఇచ్చారు. సినిమా విభిన్నంగా ఉందని, మంచి కంటెంట్‌తో సినిమాని తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు అభినందించినట్లుగా యూనిట్ చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

**************************************

*Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

**************************************

*NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

**************************************

*Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

**************************************

Updated Date - 2023-08-04T17:23:20+05:30 IST