Srikanth: అతను విలన్‌గా నాకు పోటీ వచ్చినా పర్లేదు

ABN , First Publish Date - 2023-06-26T21:47:56+05:30 IST

‘నటుడు అభినవ్ సర్దార్ నాకు తమ్ముడు లాంటోడు, మంచి ఫ్రెండ్.. అతను మంచి పాత్రలు చేస్తూ.. విలన్‌గా నాకు పోటీ వచ్చినా నాకు ఇష్టమే’ అని అన్నారు హీరో శ్రీకాంత్. ‘రామ్ అసుర్’ ఫేమ్ అభినవ్ సర్దార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టేక్’. కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ సొంత నిర్మాణంలో ASP బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని హీరో శ్రీకాంత్ విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Srikanth: అతను విలన్‌గా నాకు పోటీ వచ్చినా పర్లేదు
Abhinav Sardhar and Srikanth

‘నటుడు అభినవ్ సర్దార్ నాకు తమ్ముడు లాంటోడు, మంచి ఫ్రెండ్.. అతను మంచి పాత్రలు చేస్తూ.. విలన్‌గా నాకు పోటీ వచ్చినా నాకు ఇష్టమే’ అని అన్నారు హీరో శ్రీకాంత్ (Srikanth). ‘రామ్ అసుర్’ ఫేమ్ అభినవ్ సర్దార్ (Abhinav Sardhar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టేక్’ (Mistake). కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ సొంత నిర్మాణంలో ASP బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. (Mistake Trailer Launched)

ట్రైలర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ (Hero Srikanth) మాట్లాడుతూ.. సర్దార్ నాకు తమ్ముడు లాంటోడు, మంచి ఫ్రెండ్. ఎప్పట్నుంచో అతను నాకు తెలుసు. చాలా రంగాల్లో సర్దార్ విజయం సాధించాడు. సినిమాల్లో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా వచ్చాడు. ఈ సినిమా మీద సర్దార్‌కి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. చాలా భయంకరంగా ఉన్నాడు. విలన్‌గా నాకు పోటీ వచ్చిన పర్లేదు.. నాకిష్టమే. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ టీమ్‌కి పనిచేసిన వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

Srikanth-1.jpg

అభినవ్ సర్దార్ (Abhinav Sardhar) మాట్లాడుతూ.. నేనొక చిన్న యాక్టర్‌ని. నా కోసం ఎక్కడెక్కడ్నుంచో ఈ వేడుకకు అతిథులుగా వచ్చారు. నా కోసం ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది ఒక చిన్న సినిమా. మన అందరికీ మెగాస్టార్ చాలా ఇష్టం, ఆయన వరకు మనం వెళ్లకపోవచ్చు కానీ నా మెగాస్టార్ మాత్రం హీరో శ్రీకాంత్ అన్నే. ఏ టైంలో కాల్ చేసినా డైరెక్ట్‌గా లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఎంత ఎదిగినా ఇలా సింపుల్ గానే ఉంటారు. నాకు సొంత అన్నలాగా ఉంటారు. ఇండస్ట్రీలో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా ఒక మిస్టేక్‌తోనే మొదలుపెట్టాం. నేనెప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా పర్ఫెక్షన్‌తోనే అన్ని చేస్తాను. 2010 నుంచి సినిమాలు చేస్తున్నాను. నేను ఎన్ని బిజినెస్‌లు చేసినా, సినిమాలు, సోషల్ సర్వీస్ చేసినా చాలా క్లారిటీగా, 100 శాతం చేస్తాను. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఈ సినిమా చేసేటప్పుడు భుజానికి గాయం అయింది. ఇప్పటికి కూడా ఇంకా జిమ్‌కి వెళ్లట్లేదు ఆ గాయం వల్ల. కెమెరా మెన్ హరి, సంగీత దర్శకుడు మణి జిన్నా, ఈ సినిమాకి పని చేసినా వాళ్లందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

చిత్ర దర్శకుడు సన్నీ అలియాస్ భరత్ కొమ్మాలపాటి (Bharrath Komalapati) మాట్లాడుతూ.. 2021 లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా చేశాం. చాలా మంది ఈ సినిమాకు కష్టపడ్డాం. ఈ సినిమా నెక్స్ట్ మంత్ రానుంది. శ్రీకాంత్ అన్న గెస్ట్‌గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికి థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మళ్ళీ మాట్లాడతానని అన్నారు. ఈ ఈవెంట్‌కి హాజరైన అతిథులు, చిత్రయూనిట్ అంతా.. తమ లైఫ్‌లో జరిగిన మిస్టేక్స్‌ని షేర్ చేసుకుంటూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?


**************************************

*KS Ramarao: ప్రేక్షకులు బాగుంది అని చెప్తే.. సినిమా సక్సెస్ అయినట్టే!


**************************************

*Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది


**************************************

* Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు


**************************************

*Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!


**************************************

*Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది


**************************************

Updated Date - 2023-06-26T21:47:56+05:30 IST