Krishna Ghattam: కృష్ణాష్టమి స్పెషల్‌గా ‘కృష్ణ ఘట్టం’ సర్ప్రైజ్
ABN , First Publish Date - 2023-09-07T21:59:47+05:30 IST
వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ పతాకంపై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి, డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణంగా సురేష్ పల్లా స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కృష్ణ ఘట్టం’. ఈ సినిమా నుండి కృష్ణాష్టమిని పురస్కరించుకుని కృష్ణుడి పద్యాన్ని మేకర్స్ విడుదల చేశారు.
వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ పతాకంపై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి, డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణంగా సురేష్ పల్లా స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కృష్ణ ఘట్టం’ (Krishna Ghattam). మూడి క్రాబ్ ఫిలిం ఫెస్టివల్ 2022 (Moody Crab Film Festival 2022)లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు (Best Feature Film Award)ని ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను మాస్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు. తాజాగా కృష్ణాష్టమి పురస్కరించుకుని ఈ చిత్రంలోని కృష్ణుడి పద్యాన్ని (The Lord Krishna Padhyam) మేకర్స్ విడుదల చేశారు.
ఈ పద్యం విడుదల సందర్భంగా దర్శక నిర్మాత సురేష్ పల్లా (Suresh Palla) మాట్లాడుతూ.. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మా ‘కృష్ణ ఘట్టం’ చిత్రం నుంచి కృష్ణుడి పద్యాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సర్వలోక రక్షకుడు అయిన కృష్ణుడిని ఎవరు ఎప్పుడు ఎలా పిలువగలరు అని ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకి.. శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఈ పద్యం. ఈ అచ్చ తెలుగు పద్యం కృష్ణుడి భక్తులకు పండగలా ఉంటుందని భావిస్తున్నాం.
గత దశాబ్ద కాలంలో ఇలాంటి తెలుగు పద్య నాటకం మన తెలుగు చిత్రంలో ఎన్నడూ రాలేదు. ఈ పద్యం కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడికి నైవేద్యం లాంటిది. మా ఈ పద్యాన్ని 30 సంవత్సరాలుగా కృష్ణుడి వేషం వేస్తూ.. తెలుగు పద్యనాటకాలు చేస్తున్న గుమ్మడి గోపాలకృష్ణగారు విడుదల చేయడంతో మా టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన మా చిత్ర ట్రైలర్ మరియు పద్యనాటకం చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
============================
*Atlee: ‘జవాన్’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..
*********************************
*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
***********************************
*Rudram Kota: ‘రుద్రంకోట’ రిలీజ్‌కు రెడీ..
*************************************
*Rama Banam: ‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
*************************************