Brahmanandam: ‘అన్‌స్టాపబుల్’.. ఆనందాన్నిచ్చింది
ABN , First Publish Date - 2023-06-03T21:58:45+05:30 IST
బిగ్‌బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంత మంది కమెడియన్స్ కలిసి నటించిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరారు.
బిగ్‌బాస్ విన్నర్ విజె సన్నీ (VJ Sunny), సప్తగిరి (Saptagiri) హీరోలుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). డైమండ్ రత్నబాబు (Diamond Ratnababu) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎ2 బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్ రావు నిర్మించారు. నక్షత్ర (Nakshatra), అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఓ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడుతూ.. ‘‘యంగ్‌స్టర్స్ అందరూ కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్‌కు నా వంతుగా సహకారం అందించాలని ఈ వేడుకకు వచ్చాను. డైమండ్ రత్నబాబు అంటే నాకు చాలా ఇష్టం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. నా కామెడీ అంటే అతనికి కూడా చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను కూడా నటించాల్సి ఉంది. నాకోసం రత్నబాబు చాలా ప్రయత్నించాడు కానీ.. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాదాపు యాభై మంది నటీనటులతో ఈ సినిమా చేయడం ఆనందాన్నిచ్చింది. సన్నీ, సప్తగిరి, బిత్తిరి సత్తి, షకలక శంకర్, పృథ్వీ, చమ్మక్ చంద్ర.. ఇలా ఎంతోమంది నటీనటులతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. జంధ్యాల, రేలంగి నరసింహరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారి సినిమాల్లో ఇలా తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్ళీ ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చి అన్‌స్టాపబుల్ వంటి మంచి ఎంటర్‌టైనర్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. (Unstoppable Trailer Launch Event)
యువ దర్శకులు, నటులు, నిర్మాతలని ప్రోత్సహించాలి. అప్పుడే పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది. ఈ సినిమాని నిర్మించిన యువ నిర్మాతలు రజిత్ రావు, రఫీలకి ఆల్ ది బెస్ట్. చిత్ర బృందం అంతా కష్టపడి చేసిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుతున్నాను. ఇందులో వున్న నటులని చూస్తుంటే ముప్ఫై ఏళ్ల క్రితం ఇలానే ఉండేవాడిని కదా అని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరిని మీరందరూ ఆశీర్వదిస్తే పెద్దవాళ్ళు అవుతారు. గొప్పవారు అవుతారు. తర్వాత ప్రతి ఒక్కరూ ఒక బ్రహ్మానందం (Brahmanandam) కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం
*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా?
*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!