Bro film review: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా ఎలా ఉందంటే...

ABN , First Publish Date - 2023-07-28T14:56:55+05:30 IST

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు అంటే అభిమానుల్లో, సినిమా ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంటుంది. దానికితోడు ఆ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అంటే ఆ ఆసక్తి ఇంకా ఎక్కువవుతుంది. వీళ్లందరి కాంబినేషన్ లో వచ్చిన వచ్చిన 'బ్రో' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Bro film review: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా ఎలా ఉందంటే...
A still from Bro

సినిమా: బ్రో

నటీనటులు: పవన్ కళ్యాణ్ (PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej), ప్రియా ప్రకాష్ వారియర్ (PriyaPrakashVarrier), కేతిక శర్మ (KetikaSharma), తనికెళ్ళ భరణి (ThanikellaBharani), రాజా చేంబోలు (RajaChembolu), సుబ్బరాజు (Subbaraju), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు

ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్ (SujithVaassudev)

స్క్రీన్ ప్లే, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas)

నిర్మాత: టి జి విశ్వప్రసాద్ (TG Viswaprasad)

దర్శకత్వం: సముద్రఖని (Samuthirakani)

-- సురేష్ కవిరాయని

అభిమానులు ఎక్కువగా వుండే నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అతని సినిమా వస్తోంది అంటే అభిమానులకి పండగలానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే ఇటు కొన్ని సినిమాలు కూడా చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు, నాలుగు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తున్నా, ముందుగా ఈ 'బ్రో' అనే సినిమా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పూర్తి చేయగలిగారు. #BroTheAvatar ఈరోజు ఈ 'బ్రో' సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇది 'వినోదయ సిత్తం' #VinodhayaSitham అనే తమిళ సినిమాకి రీమేక్. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖని, తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. తమిళ సినిమాలో సముద్రఖని ప్రముఖ పాత్రలో నటించాడు కూడా, అదే పాత్రని తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించాడు. #BroReview ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించటం విశేషం. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

bro2.jpg

Bro story కథ:

మార్కండేయులు లేదా మార్క్ (సాయి ధరమ్ తేజ్) కుటుంబంలో పెద్ద కొడుకు, తండ్రి మరణం తరువాత కుటుంబం బాధ్యతలు అన్నీ అతని మీదే పడతాయి. ఇద్దరు చెల్లెల్లు, తమ్ముడు, అమ్మ వున్న ఆ కుటుంబంలో మార్క్ తన ఉద్యోగంలో పెద్దగా ఎదగాలని, చెళ్ళెళ్ళకి మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్లు చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. #BroFilmReview ఎప్పుడూ టైము లేదు అంటూ బిజీగా కాలాన్ని గడిపే మార్క్ ఒకరోజు వైజాగ్ నుండి హైదరాబాద్ కారులో వస్తూ ఉండగా పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఒక చీకటి ప్రదేశంలోకి మార్క్ వెళ్ళిపోతాడు. #BroReview తాను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయని, తన కుటుంబం అనాధ అయిపోయి రోడ్ మీద పడిపోతుందని, వాళ్ళని తన అవసరం వుంది అని టైం లేదా కాలం అనే దేవుడు (పవన్ కళ్యాణ్) ని వేడుకుంటాడు. #BroTheAvatar టైం అతనికి 90 రోజుల జీవితాన్ని ఇస్తాడు, ఇవ్వడమే కాకుండా అతనితో పాటు వస్తాడు. ఈ 90 రోజుల్లో మార్క్ తన పనులన్నీ చేసుకోగలిగాడా, అతనివలనే కుటుంబం అంతా బాగు పడిందా, ఈ 90 రోజుల్లో అతను ఏమి నేర్చుకున్నాడు అన్నది మిగతా కథ.

bro3.jpg

విశ్లేషణ:

తమిళ సినిమా 'వినోదయ సిత్తం' అనేది ఒక భావోద్వేగంతో కూడిన కథ. అందులో వాణిజ్యపరమైన అంశాలు చాలా తక్కువ. ఒక మనిషి చనిపోయాక అతనికి మళ్ళీ జీవితాన్ని ఇస్తే అతను తాను చేసిన తప్పొప్పులను ఎలా చూస్తాడు, ఎటువంటి పశ్చాత్తాపం పడతాడు, జీవితంలో దేనికీ టైం లేదనుకునేవాడు అదే టైంని ఎలా వాడుకున్నాడు అనే ఒక జీవిత సత్యాన్ని తాత్వికమైన (Philosophical) భాషలో చెప్పే కథ ఇది. తమిళంలో చిన్న సినిమాగా వచ్చిన దీన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ అంతటి ఒక అగ్ర నటుడితో చెయ్యాలంటే అది మాటలు కాదు. #BroTheAvatar అయితే పవన్ కళ్యాణ్ గురించి బాగా తెలిసిన అతని మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే బాగుంటుందో, ఎలాంటి మాటలు అతని చేత పలికిస్తే అతని అభిమానులకు ఆనందం కలుగుతుందో తెలుసు. అందుకని పవన్ కళ్యాణ్ గత సినిమాల్లోని పాటలు, అలాగే అతని అవుట్ ఫిట్స్, ఇలా అతని పాత్రని ఎలా డిజైన్ చేస్తే అభిమానులకు నచ్చుతుందేమో ఆలా ఇందులో అతని చేత చేసి చూపించాడు. #BroFilmReview పవన్ కళ్యాణ్ ఒక్కో డైలాగ్ చెపుతుంటే అతని అభిమానుల చేత ఈలలు వేయించేలా రాసాడు త్రివిక్రమ్. రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ వున్నాడు కాబట్టి, వ్యక్తిత్వానికి, రాజకీయాలకి అనుసంధానం చేస్తూ రెండిటికీ సరిపోయే విధంగా మాటలు రాసాడు త్రివిక్రమ్. వీటన్నిటి మధ్య దర్శకుడు సముద్రఖని తమిళ సినిమా చేసాడు కాబట్టి తెలుగులో కూడా కథ పాడవకుండా బాగానే నడిపించాడు. #BroReivew

తమిళం, తెలుగు కి తేడా కొద్దిగా వుంది. తమిళ మాతృకలో చనిపోయింది 60 ఏళ్ళ మనిషి, అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు వుంటారు. తెలుగులో అతన్నీ యువకుడిగా మార్చి, అతనికి ఇద్దరు చెళ్లెళ్లు, తమ్ముడు, అమ్మ గా మార్చి ఆ పాత్ర సాయి ధరమ్ తేజ్ తో చేయించి, అతనికి అనుగుణంగా కథని నడిపారు. ఒరిజినల్ కథ మాత్రం పాడుచెయ్యకుండా అలానే ఉంచారు. ఫిలసాఫికల్ మాటలు జీవితం, మరణాల మీద బాగా రాశారు త్రివిక్రమ్. #BroTheAvatar మన జీవితం, మరణం భావితరాల కోసమే అంటూనే 'పుట్టుక మలుపు మరణం గెలుపు' అని చెప్పారు. ఎంతకాలం బతికాం అనేది కాకుండా ఎవరికీ హాని చెయ్యకుండా ఎంత ఆనందంగా జీవించాం అనే విషయం బాగా చెప్పారు. కాలమే మృతువు అని పురాణాల్లో చెపుతారు, అలాగే పాముని కూడా మృత్యువుతో పోలుస్తారు, అందుకే పవన్ కళ్యాణ్ మెడలో పాము బొమ్మ వుండే గొలుసు వేసుకుంటాడు. మార్క్ చనిపోయాక మొదటి రోజు నుండి 82 రోజు వరకు అందరూ ఎలా ప్రవర్తించారు, అలాగే అతను చిన్నప్పటి సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

bro4.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ తన మేనరిజంతో అభిమానులు అక్కటుకొనేలా చేశారు. అతను, సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి, చెప్పాలంటే ఈ ఇద్దరిమధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకి ప్రధాన బలం. పవన్ కళ్యాణ్ ఒక పక్క తనదైన మార్కుతో ప్రేక్షకులను ఉత్తేజ పరిస్తే, సాయి ధరమ్ తేజ్ తన పాత్ర ద్వారా భావోద్వేగాలను పలికించాడు. కేతిక శర్మ పాత్ర చిన్నదే అయినా అందంగా వుంది, అలాగే పాత్రకి తగ్గట్టుగా చేసింది. ప్రియా వారియర్, సాయి ధర్మ తేజ్ చెల్లెలుగా బాగా మెప్పించింది. ఒకవిధంగా ఆమెకి మంచి పాత్ర దొరికింది అనే చెప్పాలి. ఇక సుబ్బరాజు, రాజా చెంబోలు పాత్రలు మామూలివే. బ్రహ్మానందం పాత్ర కావాలని పెట్టినట్టుగా వుంది, అలాగే 30ఇయర్స్ పృథ్వి పాత్ర కూడా. వెన్నెల కిషోర్, రోహిణి, తనికెళ్ళ భరణి అందరూ సపోర్ట్ చేశారు. థమన్ నేపధ్య సంగీతం సినిమాకి హైలైట్ అని చెప్పాలి, ముఖ్యంగా క్లైమాక్స్ లో. సాంకేతికంగా కూడా సినిమా బాగానే చేశారు. అలాగే త్రివిక్రమ్ మాటలు ఇంకో హైలైట్. ఛాయాగ్రహణం చేసిన సుజిత్ వాసుదేవ్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే అతని పనితనం సినిమాలో కనపడుతుంది, ఒక విధంగా సినిమాకి అతను ఒక మూలస్థంభం అని చెప్పొచ్చు.

bro1.jpg

చివరగా, 'బ్రో' అనే సినిమా మనిషి పుట్టుక, మరణం, బతికున్న కాలం ఏమి చేసాడు, ఎలా పశ్చాతాపం పడతాడు, ఇలాంటి ఫిలసాఫికల్ నేపథ్యంలో వున్న కథని, పవన్ కళ్యాణ్ అనే ఒక మాస్, అగ్ర నటుడు చేత ఎంటర్ టైన్ మెంట్ గా, వైవిధ్యంగా చేయించి సఫలం అయ్యారనే చెప్పాలి. అభిమానులను బాగా అలరించే సినిమా అని చెప్పొచ్చు.

Updated Date - 2023-07-28T14:56:55+05:30 IST