Mayapetika Film Review: మొబైల్ గురించి అని చెప్పి...

ABN , First Publish Date - 2023-06-30T17:54:37+05:30 IST

పాయల్ రాజపుట్ నటించిన 'మాయాపేటిక' ఈ వాసరం విడుదలైన చిన్న సినిమాలలో ఒకటి. రమేష్ రాపర్తి దీనికి దర్శకుడు, ఈ సినిమా మొబైల్ గురించిన నేపధ్యలో వచ్చిన కథ.

Mayapetika Film Review: మొబైల్ గురించి అని చెప్పి...
Mayapetika film review

సినిమా: మాయాపేటిక

నటీనటులు: పాయల్ రాజపుట్, సిమ్రత్ కౌర్, విరాజ్ అశ్విన్, రజత్ రాఘవ్, సునీల్, పృధ్వీ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు

సంగీతం: గుణ బాలసుబ్రమణియన్

ఛాయాగ్రహణం: సురేష్ రగుతు

దర్శకుడు: రమేష్ రాపర్తి

నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారకనాథ్ బొమ్మిరెడ్డి

-- సురేష్ కవిరాయని

ఈవారం నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) నటించిన 'స్పై' #SpyMovie సినిమాతో పాటు చాలా చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి. అందులో ఒకటి పాయల్ రాజపుత్ (PayalRajput) నటించిన 'మాయాపేటిక' MayapetikaFilmReview సినిమా. ఇది మొబైల్ (Mobile) ఎలా ఒక మనిషి జీవితంలో ఎలా ఒక భాగం అయింది, ఎంతటి మార్పులు తెచ్చింది అనే నేపధ్యంలో వచ్చిన సినిమా. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Mayapetika story కథ:

పాయల్ (పాయల్ రాజపుత్) టాలీవుడ్ లో టాప్ బిజీ హీరోయిన్, ఆమె మొబైల్ ఫోన్ పనిచేయలేదు అని తెలిసి, ఆ చిత్ర నిర్మాత ఆమెకి ఒక స్మార్ట్ ఫోన్ బహుమానంగా ఇస్తాడు. అదే సమయంలో ఆమె కాబోయే భర్త కూడా ఆమెకి ఒక ఫోన్ కొనిద్దామని తీసుకు వస్తుంటే, ఆమె నిర్మాత తనకు ఫోన్ బహూకరించాడని అది చాలా బాగుంది అని చెప్తుంది పాయల్. అలాగే ఆ నిర్మాత చాలా సార్లు పాయల్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు, అది చూసి కాబోయే భర్తకి ఆ ఫోన్ చూసినప్పుడల్లా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ ఫోన్ వాడొద్దు విసిరెయ్యి అంటాడు, అందుకని పాయల్ ఆ ఫోన్ ని తన అసిస్టెంట్ కి ఇస్తుంది. అతను కార్పొరేటర్ (పృథ్వి) కి ఇస్తాడు లంచంగా. అతను దగ్గర నుండి ఆ ఫోన్ ఇంకొకరి చేతికి అలా మారుతూ ఉంటుంది. ఆ ఫోన్ ఎవరి చేతికి వచ్చినా వాళ్లకి ఎదో సంఘటన జరుగుతూ ఉంటుంది. చివరికి ఆ ఫోన్ ఎక్కడికి చేరింది, కథ ఎలా మలుపులు తిరిగింది అనే విషయం సినిమా చూస్తే తెలుస్తుంది.

mayapetika1.jpg

విశ్లేషణ:

దర్శకుడు రమేష్ రాపర్తి ఒక వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు, కానీ అది ఎలా చెప్పాలో తెలియక కొంచెం తికమక పడ్డట్టుగా కనిపించింది. ఒక మొబైల్ ఫోన్ మానవ జీవితంలో ఎంతటి ప్రాబల్యం చూపిస్తోంది, అది ఒక్కొక్కరి జీవితంలోకి ప్రవేశించి ఎలా వాళ్ళ జీవితంలో మార్పులు తెస్తుంది అనేది దర్శకుడి పాయింట్. కానీ ఈ చూపించటంలో దర్శకుడు ఒక్కోదానికి సరిగ్గా లింక్ చూపించలేకపోయారు. మొబైల్ ఫోన్ పాయల్ తో మొదలుపెట్టి ఆమె దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాక, ఆమెని అక్కడే వదిలేసాడు. రెండో వ్యక్తి దగ్గర నుండి ఆ ఫోన్ వేరే వాళ్ళకి మారాక, రెండో వ్యక్తి కథ అక్కడితో అయిపొయింది. #MayapetikaFilmReview ఇంకా మూడో పర్సన్ కార్పొరేటర్ కథ, ఇతని పాత్రని నిజ జీవితంలో వివాదాల్లో చిక్కుకున్న ఒక ఎంఎల్ఎ అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆమధ్య ఒక ఎంఎల్ఎ ఒక అమ్మాయితో ఫోన్ లో జరిపిన సంభాషణ ఈ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పించాడు. #MayapetikaReview విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్ ల మధ్య ఆ చాట్ ఎక్కువ సేపు పెట్టేసి బాగా బోర్ కొట్టించాడు. విరామం తరువాత ఆ సునీల్, శ్యామల ఎపిసోడ్ వాళ్ళు టిక్ టాక్ వీడియోస్ చేసి ఎలా పాపులర్ అయ్యేది అన్నది. అందులో నవ్వుకోవచ్చు కానీ, కథకి అనుగుణంగా లేదు. ఇక శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ మొత్తం సరిగ్గా చూపించలేకపోయాడు అనిపిస్తుంది. ఇలా ఒక్కో కథ ఒకదానికొకటి సంబంధం లేకుండా చివరికి క్లైమాక్స్ ని కూడా చాలా నిరాసక్తంగా తీసేసాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే, పాయల్ రాజపుత్ (PayalRajput) ఈ సినిమాలో కూడా పాయల్ రాజపుత్ గానే కనపడుతుంది. ఆమె పాత్ర పెద్దగా ఏమీ ఉండదు, కానీ ఉన్నంతలో బాగా చేసింది. విరాజ్ అశ్విన్ (VirajAswin), సిమ్రత్ కౌర్ (SimratKaur) జంట బాగుంది, సిమ్రత్ కౌర్ చాలా అందంగా వుంది, ఆమెకి మాటలు ఏమీ లేవు. అలాగే పృథ్వి (Prudhvi) కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు పాత్రలో 'విప్పేయ్' అనే ఊతపదం తో కాస్తా నవ్వించాడు. అతనికి జోడిగా మిర్చి కిరణ్ బాగా సెట్ అయ్యాడు. శ్రీనివాస్ రెడ్డి (SrinivasaReddy) కూడా బాగున్నాడు కానీ, ఆ చెప్పే విధానం మీద దర్శకుడు కొంచెం దృష్టి పెట్టు ఉంటే బాగుండేది. సునీల్ (Sunil), శ్యామల (AnchorSyamala) కేవలం టిక్ టాక్ వీడియోస్ వరకే పరిమితం అయ్యారు. ఛాయాగ్రహణం బాగుంది, నేపధ్య సంగీతం బాగుంది.

చివరగా, ఈ 'మాయాపేటిక' అనే మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకు వస్తుంది అనే విషయం మీద. మంచి పాయింట్, కానీ దర్శకుడు ఆ విషయాన్ని తెర మీద సరిగ్గా చూపించలేకపోయారు. కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీయడం లాంటివి చెయ్యడంతో ఈ సినిమా కేవలం ఓటిటి కి మాత్రమే పనికొచ్చే సినిమా గా తయారయింది.

Updated Date - 2023-06-30T17:54:37+05:30 IST