Sir film review: మంచి ప్రయత్నమే కానీ...

ABN , First Publish Date - 2023-02-17T11:13:08+05:30 IST

తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ధనుష్(Dhanush), హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించి మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ సినిమాలు అంటే అందులో ఎదో ఒక విషయం ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. అటువంటి విలక్షణ నటుడు అయిన ధనుష్ (Dhanush) ఇప్పుడు తెలుగులో ఆరంగేట్రం 'సార్' (#SirMovie) అనే సినిమాతో చేస్తున్నాడు.

Sir film review: మంచి ప్రయత్నమే కానీ...

సినిమా: సార్

నటీనటులు : ధనుష్, సంయుక్త, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, 'హైపర్' ఆది, 'ఆడుకాలమ్' నరేన్, పమ్మి సాయి, మొట్ట రాజేందర్ తదితరులు

ఛాయాగ్రహణం : జె. యువరాజ్

సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్

నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య

రచన, ద‌ర్శ‌క‌త్వం : వెంకీ అట్లూరి

-- సురేష్ కవిరాయని

తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ధనుష్(Dhanush), హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించి మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ సినిమాలు అంటే అందులో ఎదో ఒక విషయం ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. అటువంటి విలక్షణ నటుడు అయిన ధనుష్ (Dhanush) ఇప్పుడు తెలుగులో ఆరంగేట్రం 'సార్' (#SirMovie) అనే సినిమాతో చేస్తున్నాడు. దీనికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించాడు. ఇదే సినిమా (#SirReview) తమిళంలో 'వాతి' (#Vaathi) గా కూడా విడుదల అవుతోంది. విద్యావ్యవస్థ ఎలా వ్యాపారాత్మకం అయిపొయింది అనే నేపథ్యంలో రూపొందించిన (#SirFilmReview) సినిమా అని విడుదలకు ముందు చెప్పారు. మరి ఆ పాయింట్ ఈ సినిమాలో సరిగ్గా చెప్పగలిగారు, సినిమా ఎలా వుందో చూద్దాం. సుమంత్ (Sumanth) ఒక ప్రత్యేక పాత్రలో కనపడతాడు.

Sir film story కథ:

ఈ కథ విశాఖపట్నం లోని సిరిపురం దగ్గర జరుగుతుంది. ప్రభుత్వ కళాశాలలు మూత పడుతున్న సమయంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు స్కూల్, కాలేజీ లు స్థాపించి విద్యని వ్యాపారం చేసేస్తూ వుంటారు. బాలు లేక బాలగంగాధర్ తిలక్ (ధనుష్) ఒక డ్రైవర్ కొడుకు అయినా, బాగా చదువుకొని జూనియర్ లెక్చరర్ స్థాయికి ఎదుగుతాడు. అతను సిరిపురం లోని ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో లెక్చరర్ గా వెళ్లి అక్కడ విద్యార్థులు ఎవరూ కాలేజీ కి రాకపోతే, తను చదువు ఎంత ముఖ్యమో చెప్పి అందరినీ కాలేజీకి రప్పిస్తాడు. బాలు సర్ అని అక్కడ అందరితో పిలవబడే అతనికి అక్కడే మీనాక్షి (సంయుక్త) అనే ఇంకో లెక్చరర్ కూడా పరిచయం అవుతుంది. ఇంతకీ అతన్ని సిరిపురం కాలేజీ కి ఎందుకు పంపారు? అతని బోధనలు విని విద్యార్థులు బాగా చదువుకొని మొదటి తరగతిలో ఉతీర్ణులయితే బాలు సార్ కి ఎదురుదెబ్బలు ఎందుకు తగిలాయి. ప్రైవేట్ కాలేజీ నడుపుతున్న త్రిపాఠి తన వ్యాపారం కోసం ఏమి చేసాడు, బాలు అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ.

17sir.jpg

విశ్లేషణ:

దర్శకుడు వెంకీ అట్లూరి ఒక మంచి భావనని ఎంచుకొని దానిని కథగా మలిచాడు. అంతవరకు అది చాలా బాగుంది. కానీ ఇలాంటి కథలు తెర మీద చూపాలంటే, దానికి చాలా సాధన అవసరం. ప్రేక్షకులను రెండు గంటలకి పైగా ఆసక్తికరంగా ఉంచాలంటే దర్శకుడు తన ప్రతిభకి పదునుపెట్టి ఇలాంటి కథకి, మంచి కథనం కూడా తయారవ్వాలి. (#SirReview) అయితే ఇక్కడ దర్శకుడు వెంకీ కథ బాగుంది, కానీ కథనం, ఆ కథని ఆసక్తికరంగా చూపే విధానమే కొంచెం గాడి తప్పింది. ధనుష్ లాంటి ఒక పెద్ద నటుడు తనకి దొరికాడు అని ఒక రెండు సెట్స్ వేసి అందులోనే మొత్తం కథ అంతా నడిపిస్తే ప్రేక్షకుడికి ఆసక్తి ఏముంటుంది. కథలో సహజత్వం ఉండాలి, భావోద్వేగాలు ఉండాలి, ఇంకా అప్పటి సంఘటనలను ప్రేక్షకుడికి హత్తుకునేలా చూపాలి.

మంచి కథ ఎంచుకొని దర్శకుడు వెంకీ కొంచెం హడావిడిగా ఈ 'సార్' సినిమాని పూర్తి చేసినట్టు కనిపిస్తోంది. మొదటి సగం లో సినిమాలో విషయం లేదు, దమ్ము లేదు. ఏమున్నా కొంచెం విషయం వుంది అంటే అది కూడా రెండో సగం లోనే. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు కదిలించినా, అవొక్కటే ఉంటే సరిపోవు కదా. విద్య వ్యాపారాత్మకం అయిపొయింది, చదువు అనేది అందరికీ ఉండాలి, అది ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే పాయింట్ హత్తుకునేట్టు చెప్పాలి దర్శకుడు. అక్కడే ఫెయిల్ అయ్యాడు.

నేను 1980 దశకం లో ప్రభుత్వ పాఠశాల, కాలేజీ లో చదివి పైకి వచ్చినవాడిని. నాకు తెలిసి 1990 వరకు ప్రభుత్వ కళాశాలలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. లెక్చరర్లు, విద్యార్థులు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఎప్పుడయితే ప్రైవేట్ కళాశాలలు వచ్చి, ప్రభుత్వ లెక్చరలను ఎక్కువ జీతాలు ఇచ్చి తీసుకున్నారో, (#SirFilm) అప్పుడు ప్రభుత్వ కళాశాలలు కొంచెం తగ్గాయి. ఆ తరువాత బాగా పాఠాలు చెప్పే లెక్చరర్లను ప్రైవేట్ కాలేజీలు కొనేసి వాళ్ళతో విద్యార్థులకు తర్ఫీదు ఇప్పించటం, అలాగే ర్యాంకులు కోసం వాళ్ళు ఎటువంటి తప్పుడు పనులు చేసారు, ప్రైవేట్ కాలేజీల వలన వచ్చే అనర్ధాలు ఇటువంటి చాలా పాయింట్స్ దర్శకుడు భావోద్వేగంగా చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఇవన్నీ టచ్ చెయ్యకుండా, కేవలం ధనుష్ అనే ఒక నటుడు దొరికాడు అని, నాలుగు పోరాట సన్నివేశాలు, రెండు పాటలు పెడితే ఎలా. దర్శకుడు దీని మీద ఇంకా కొద్దిగా హోమ్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. సహజత్వం లోపించింది. ఎదో అబ్దుల్ కలాం కథ ఒక మూడు నిముషాలు చెప్పగానే విద్యార్థులు వెంటనే కాలేజీ కి వచ్చేస్తారు అంటే అది నమ్మ బుద్ధిగా తీయాలి. ఏమి సన్నివేశాలు వస్తాయో ముందుగా ప్రేక్షకుడికి తెలిసిపోతాయి. ఏమైనా కూడా వెంకీ ఒక మంచి ప్రయత్నం చేసాడు, కానీ తెర మీద అంత బాగా చూపించలేకపోయారు. (#SirFilmReview)

ఇక నటీనటుల విషయానికి వస్తే, ధనుష్ ఒక మంచి నటుడు, అతను బాలు సార్ పాత్రలో ఇమిడిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా అంతా ధనుష్ తన భుజస్కందాలపై వేసుకున్నాడు. సంయుక్త అందంగా వుంది, (#SirFilmReview) తన పాత్ర పరిధి మేరకి బాగా నటించింది. సముద్రఖనికి ఇలాంటి పాత్రలు మామూలే. అలాగే సాయి కుమార్, తనికెళ్ళ భరణి కూడా. హైపర్ అది హాస్య సన్నివేశాలు అంత బాగా ఎక్కవు ప్రేక్షకుడికి. అలాగే కొందరు తమిళ నటులు కూడా వున్నారు ఇందులో. మధ్య మధ్యలో ప్రేక్షకుడికి ఇది తమిళ సినిమాలా అనిపిస్తూ ఉంటుంది.

మాటలు చాల బాగున్నాయి. కొన్ని మాటలు అయితే మనసును హత్తుకుంటాయి. మీరు డబ్బు ఎలా అయినా సంపాదిస్తారు, కానీ ఒక్క చదువు మాత్రమే గౌరవం తెచ్చి పెడుతుంది. విద్య అనేది గుడిలో నైవేద్యం లాంటిది, దాన్ని అందరికీ పంచండి, అమ్మకండి, ఇలా సినిమాలో చాలా మాటలు వున్నాయి. ఇంకా జీవీ ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar) అందించిన పాటలు, నేపథ్య సంగీతం బావుంది. 'మాష్టారు మాష్టారు...' అనే పాట సినిమాలో హైలైట్, విడుదలకు ముందు కూడా ఆ పాట మంచి హిట్ అయింది. అవినాష్ కొల్ల (Avinash Kolla) అప్పట్లో వైజాగ్ సిరిపురం ఎలా ఉండేదో , అలాగే మిడిల్ క్లాస్ కాలనీ సెట్స్ ఇవన్నీ బాగా వేసాడు. (#SirFilmReview)

చివరగా, దర్శకుడు వెంకీ అట్లూరి ఒక మంచి పాయింట్ తో కథ రాసాడు, కానీ దాన్ని కొంచెం విపులంగా, ప్రేక్షకుల మనసులకు హత్తుకునే విధంగా చూపించలేకపోయారు. ధనుష్ నటన చాలా బాగుంది, అంతే. సినిమా మొత్తం ఒక రెండు సెట్స్ లో తీసేసాడు అనిపిస్తుంది. మాటలు బాగున్నాయి. సినిమా విజయానికి ఇవన్నీ సరిపోవు. (#SirFilmReview)

Updated Date - 2023-02-17T11:13:09+05:30 IST